Begin typing your search above and press return to search.

'రాహుల్ తీరు మారలేదు', మరోసారి స్పందించాడు!

By:  Tupaki Desk   |   20 Jun 2019 12:39 PM GMT
రాహుల్ తీరు మారలేదు, మరోసారి స్పందించాడు!
X
ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగే ఉద్దేశం తనకు లేదని మరోసారి స్పష్టం చేశాడు రాహుల్ గాంధీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరోసారి ఆ విషయంలో స్పందించాడు. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టే అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించాడు.

ఈ విషయంలో రాహుల్ ను కన్వీన్స్ చేసేందుకు ఆ పార్టీ నేతలు పరిపరివిధాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా సోనియాగాంధీ, ప్రియాంకలు కూడా రాహుల్ కు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారట. ఆయన రాజీనామాను ఉపసంహరించుకోవాలని వారు కోరారట. అయితే రాహుల్ మాత్రం తను రాజీనామాను వెనక్కు తీసుకోవడం లేదని వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇక రాహుల్ ను కన్వీన్స్ చేయడానికి కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. రోజులు గడుస్తున్నా రాహుల్ గాంధీ మారడం లేదని, ఆయన రాజీనామాకే కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగ సమయంలో రాహుల్ గాంధీ తీరు వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఉండగా రాహుల్ గాంధీ సభలో ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యాడు. ఇదంతా వీడియోల్లో రికార్డు కాగా.. ఆ వీడియోను బీజేపీ హైలెట్ చేస్తూ ఉంది. రాహుల్ తీరు మారలేదని అంటూ బీజేపీ వాళ్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు.