Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో దోస్తీపై కాంగ్రెస్ పునరాలోచన

By:  Tupaki Desk   |   13 Dec 2018 1:30 AM GMT
చంద్రబాబుతో దోస్తీపై కాంగ్రెస్ పునరాలోచన
X
తెలంగాణలో చంద్రబాబును చంకనెక్కించుకుని దారుణంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పడు ఆ నిర్ణయంపై పునరాలోచిస్తుందట. వాస్తవానికి చంద్రబాబుతో దోస్తీని పార్లమెంటు ఎన్నికలు - ఏపీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని.. అన్నీ కుదిరి కేంద్రంలో యూపీఏ సర్కారు ఏర్పడితే అందులోనూ చంద్రబాబుకు స్థానమివ్వాలని అనుకుంది. అందుకే చిరకాల వైరాన్ని మరిచి మరీ చేయందించింది. కానీ.... చంద్రబాబు ఐరన్ లెగ్ దెబ్బకు తమ చేయి కాలుతుందని ఇప్పుడు టెన్షన్ పడుతోందట.

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ పెద్దలకు పూర్తిస్థాయిలో నమ్మకం లేనప్పటికీ మరీ ఇంత దారుణంగా ఓడిపోతామని అనుకోలేదట. గతం కంటే కనీసం 10 సీట్లయినా ఎక్కువ వస్తాయని అనుకున్నారు. కానీ, గతం కంటే సీట్లు తగ్గిపోయాయి. చంద్రబాబుపై ఉణ్న వ్యతిరేకత తమకూ అంటుకోవడం వల్లే ఇలా జరిగిందని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారు ఈ విశ్లేషణను రాహుల్ చెవిన కూడా వేశారట. దీంతో ముందుముందు చంద్రబాబు వల్ల మరింత నష్టం కలుగుతుందని ఆయన టెన్షన్ పడుతున్నారట.

అసలు చంద్రబాబు బీజేపీకి సహజ మిత్రుడని... తమకు బద్ధ శత్రువైన ఆయన్ను చేర్చుకోవడం పొరపాటు నిర్ణయమని.. చంద్రబాబు తమ కూటమిలో ఉంటే పలు ఇతర పార్టీలు చేకుండాపోయే ప్రమాదం ఉందన్న సందేహాలూ కాంగ్రెస్ పెద్దల్లో మొదలయ్యాయట. దీంతో చంద్రబాబును ఎలా దూరం పెట్టాలా అని రాహుల్ ఆలోచిస్తున్నట్లు టాక్.