Begin typing your search above and press return to search.

రాహుల్ నిస్సహాయత.. వీళ్లకి బలం..

By:  Tupaki Desk   |   24 Jan 2019 2:30 PM GMT
రాహుల్ నిస్సహాయత.. వీళ్లకి బలం..
X
మరో రెండు నెలల్లో లోక్‌ సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ లోక్‌ సభ స్థానాలు పెంచుకునేందుకే సమాయత్తమవుతున్నాయి. ఇందులో ప్రధానంగా అధికార పార్టీ బీజేపీని ఓడిచేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు - పై ఎత్తులు వేస్తోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఇందుకు ఇటీవల పశ్చిమబెంగాల్‌ లో జరిగిన ర్యాలీయే నిదర్శనం. ఈ ర్యాలీ బెంగాల్‌ ప్రాంతీయ పార్టీ తృణముల్‌ ఆధ్వర్యంలో సాగినా ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ - ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌ వాది పార్టీ - కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగిందని చెప్పవచ్చు. దీంతో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కూటమి ఏర్పడడం ఖాయమనే తెలుస్తోంది. ఈ తరుణంలో బీజేపీపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ పరిస్థితిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తే ప్రధాన మంత్రి ఎవరనే అభిప్రాయం పైకి చెప్పకపోయినా లోలోపల పార్టీ నాయకులు తమను తామే ఊహించుకుంటున్నారు.. అయితే ఇప్పటికే ఎక్కువ లోక్‌ సభ స్థానాలున్న తాము వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామని మమత చెబుతోంది. దీంతో మమత తానే ప్రధానినని చెప్పకనే చెబుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిసినా మరోవైపు ఆ పార్టీల పైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు. గతంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేసినా కాంగ్రెస్‌ గెలుచుకున్న స్థానాలను భట్టి కాంగ్రెస్‌ నుంచే ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. మరి ఈసారి కాంగ్రెస్‌ నుంచి తక్కువ లోక్‌ సభ స్థానాలు వస్తే ప్రాంతీయ పార్టీల్లో ఎవరో ఒకరు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. దీంతో రాహుల్‌ గాంధీ కన్న కలలు కల్లలవడం ఖాయమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో కాంగ్రెస్‌ లోని సీనియర్లు - ఇతరులు చెబుతున్న ప్రకారం రాహుల్‌ కాంగ్రెస్‌ ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ మమతతో కలిసి నడిచినా ఇక్కడ స్నేహంగా ఉన్న సమాజ్‌ వాదీ పార్టీతో ఉత్తర ప్రదేశ్‌ లో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుంటే ఇక్కడ ఇప్పటికే బీఎస్పీ - ఎస్పీలు దోస్తీ కట్టి ప్రచారం చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి గతంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈసారి అంతేస్థాయిలో శ్రమించాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది.ఇక జాతీయ స్థాయిలో పొత్తుకు ఓకే కానీ ఏపీలో కుదరదని టీడీపీ అదినేత చంద్రబాబు రాహుల్ కు హ్యాండిచ్చారు. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కడం అనుమానంగా మారింది. కర్ణాటకలోనూ జేడీఎస్ తో ముందుకెళ్తున్న కాంగ్రెస్ కు సంపూర్ణ సీట్లు కష్టమే.. తమిళనాట డీఎంకేపై ఆధారపడాల్సి వస్తోంది.

ఇటీవల తూర్పు ఉత్తరప్రదేశ్‌ కు ప్రియాంక గాంధీని బాధ్యతలు ఇచ్చినా ఆమె ఇక్కడికే పరిమితం కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా క్యాంపేయిన్‌ స్టార్‌ గా ప్రియాంకను నియమిస్తే బాగుండునని కొందరు నాయకులు అంటున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల కోసం రాహుల్‌ కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లినా మరికొన్ని ప్రాంతాల్లో పోరాటం చేయక తప్పదని తెలుస్తోంది.