Begin typing your search above and press return to search.

ఇక్కడ ప్రచారం....అక్కడ పరాభవం

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:26 AM GMT
ఇక్కడ ప్రచారం....అక్కడ పరాభవం
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మహాకూటమి పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలసి ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. గడచిన 30 సంత్సరాలుగా బద్ద వైరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతోను - ఆ పార్టీ అధ్యక్షునితో ఒకే వేదిక పంచుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలోను తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో కలసి పోటి చేయడం ఒక నెరం అయితే - ఒకే వేదిక నుంచి ప్రచారం చేయడం మరింత దోషమని రాజకీయ పండితులు అంటున్నారు. మహాకూటమికి తెలంగాణలో విజయం దక్కడం మాట అటుంచి ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ తీవ్ర స్దాయిలో నష్టపోతుందని అంచన వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా రాహుల్ - చంద్రబాబు నాయుడుల కలయికను అపవిత్ర కలయికగానే భావిస్తున్నారని గ్రామాలలో ఇది ఎక్కువగా వినిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి రెండు దశాబ్దాల కాలం పట్టిందని, ఈ అలస్యం వెనుక చంద్రబాబు నాయుడి "హస్తం" ఉందని అంటున్నారు. దీని ప్రభావం తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఎంతో ఉంటుందని, ఈ ఎన్నికలలో మహాకూటమి పరాజయం పాలైతే ఇది కూడా ఒక అంశామేనని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల అగ్రనేతలు తెలంగాణలో ఒకే వేదికను పంచుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకో లేరు. రాష్ట్రాన్ని విడదీసారనే కోపంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాతో పాటు మరిన్ని అభివ్రుద్ది కార్యక్రమాల కోసం చంద్రబాబు నాయడికి - బిజేపీలకు పట్టం కట్టారు. ఈ రెండు పార్టీలు నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని - అక్కడ ఇక్కడ పదవులు అనుభవించారు. ఈ రెండు పార్టీల పెళ్లినాటి ప్రమాణాలను నాలుగేళ్ల తర్వాత గంగలో కలిపారనే కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తో కలవడాన్ని ఏపీ ప్రజలు అంగీకరించటం లేదు. దీనికి తోడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంథీ - చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై నుంచి ప్రచారం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుతారమూ మింగుడు పడటంలేదు. ఈ ఇద్దరి నాయకుల తెలంగాణలో ఒకే వేదికను పంచుకుంటే మాత్రం ఏపీలో సైకీల్‌ కు పంచర్ కావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఈ ఇద్దరి ప్రచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియకపోయిన ఆంధ్రప్రరదేశ్‌ లో మాత్రం ఈ ఇద్దరికి పరాభవం తప్పదని విశ్లేషిస్తున్నారు.