Begin typing your search above and press return to search.

రాధేమా లీల‌ల్ని తెలిపే తాజా వీడియో!

By:  Tupaki Desk   |   26 April 2018 5:33 AM GMT
రాధేమా లీల‌ల్ని తెలిపే తాజా వీడియో!
X
పేరుకు అధ్యాత్మాకి వేత్త‌. ఆ ముసుగులో ఇప్ప‌టికే వికారాల్ని ప్ర‌ద‌ర్శించే పెద్దోళ్లు ఉన్నారు. త‌న‌ను తాను దేవ‌తా అవ‌తారంగా చెప్పుకునే వివాదాస్ప‌ద అధ్యాత్మిక వేత్త రాధేమా లీల‌ల గురించి.. ఆమె చ‌ర్య‌ల గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. కేసులతో.. లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని ప‌ట్టించుకోకుండా త‌న దారిన తాను ఉండ‌టం ఆమెకు మాత్ర‌మే చెల్లుతుంది.

డిజైన‌ర్ దుస్తుల‌తో మెరిసిపోతూ.. స్టైలీష్ గా.. ఫ్యాష‌న్ ఐకాన్ గా క‌నిపించే రాధేమా చ‌ర్య‌ల‌న్నీ అనూహ్యం అన్న‌ట్లుగా ఉంటాయి. ఆ వాద‌న నిజ‌మ‌న్న రీతిలో తాజాగా విడుద‌లైన ఒక వీడియో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ఒక వేడుక‌లో రాధేమా వ్య‌వ‌హార‌శైలి ముక్కున వేలేసుకునేలా ఉంటుంది.

వీడియో వెనుక అస‌లు విష‌యంలోకి వెళితే.. ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని జైపూర్ ప‌ట్ట‌ణంలో ఎంఎం మిఠాయివాలా నిర్వాహ‌కుడు మ‌న్మోహ‌న్ గుప్తా మ‌న‌మ‌రాలి పెళ్లి జ‌రిగింది. పెళ్లి కొడుకు ఎవ‌రో కాదు.. రాధేమా కొడుకు బావ‌మ‌రిది. మ‌రి.. ఇంట్లో జ‌రిగే పెళ్లికి రాధేమా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు క‌దా.

పై నుంచి కింద‌వ‌ర‌కూ రెడ్ క‌ల‌ర్ ఫుల్ గౌన్ లాంటి డిజైన‌ర్ దుస్తుల్ని ధ‌రించిన ఆమె అంద‌రిలోనూ తానెంత ప్ర‌త్యేక‌మో చెప్ప‌క‌నే చెప్పేశారు. వేడుక‌కు హాజ‌రైన ఆమె.. ఇంత‌లో మ్యూజిక్ స్టార్ట్ కావ‌టం.. అనంత లోకాల్లో ఉండే దైవంతో క‌నెక్ట్ అయిన‌ట్లున్నారు.. వెంట‌నే త‌న తీరులో తేడా తెచ్చేశారు. మ్యూజిక్ తో సంబంధం లేకుండా త‌న‌దైన శైలిలో మూవ్ మెంట్స్ తీసుకొస్తూ అధ్యాత్మిక నృత్యాన్ని అక్క‌డి అతిధుల‌కు పంచారు. రాధేమా చ‌ర్య‌ల్ని ఆ ఫంక్ష‌న్ కు హాజ‌రైన ప‌లువురు భ‌క్తితో కొంద‌రు.. భ‌యంతో మ‌రికొంద‌రు. . ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ ఇంకొంద‌రు వీక్షించారు. దీన్నంతా ఎవ‌రో ఒక ఔత్సాహికుడు వీడియో తీసి ఆన్ లైన్లో అప్ లోడ్ చేశాడు. దీంతో.. ఈ వీడియో కాస్తా వైర‌ల్ అయ్యింది. అందులో.. రాధేమా నృత్య‌రీతుల్ని చూసి త‌రించండి.

వీడియో కోసం క్లిక్ చేయండి