Begin typing your search above and press return to search.

మోడీ ఫారిన్ టూర్ లెక్క‌ల‌కు నో

By:  Tupaki Desk   |   15 July 2017 10:15 AM GMT
మోడీ ఫారిన్ టూర్ లెక్క‌ల‌కు నో
X
దేశ ప్ర‌ధానిగా ఎన్నికైన న‌రేంద్ర మోడీ మీద మొద‌టి రెండేళ్ల‌లో ఒక పెద్ద విమ‌ర్శ ఉండేది. ఆయ‌న్ను దేశ ప్ర‌ధాని క‌న్నా కూడా.. ఫారిన్ ప్ర‌ధాని అని ఎట‌కారం చేసుకునే వారు. స్వ‌దేశంలో కంటే కూడా విదేశాల్లోనే ఆయ‌న ఎక్కువ కాలం గ‌డుపుతుండేవార‌ని కాంగ్రెస్ స‌హా విపక్షాల‌న్నీ విరుచుకుప‌డేవి. మీడియాలోనూ ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల మీద కార్టూన్లు భారీగానే అచ్చు అవుతుండేవి.

అయితే.. మోడీ విదేశాంగ విధానం నెమ్మ‌ది నెమ్మ‌దిగా అర్థ‌మ‌వుతున్న ప‌రిస్థితి. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మూడేళ్ల వ్య‌వ‌ధిలో విదేశీ వ్య‌వ‌హారాల విష‌యంలో బార‌త్ ఎంత బ‌లంగా మారింద‌న్న విష‌యం అంద‌రికి అర్థం అవుతోంది. ఈ మ‌ధ్య‌న త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో.. అంత‌ర్జాతీయ వేదిక మీద పాక్ మీద జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ ను ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. తాము ఆ త‌ర‌హా దాడులు చేసినా ప్ర‌పంచంలో ఏ దేశం కూడా వ్య‌తిరేకించ‌లేద‌ని చెప్ప‌టం ద్వారా విదేశాంగ విధానంలో ఎంత బ‌లంగా ఉన్నామ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు

ఇటీవ‌ల కాలంలో ఏ ప్ర‌ధాన‌మంత్రి చేయ‌నన్ని విదేశీ ప‌ర్య‌ట‌ల్ని మోడీ చేశార‌ని చెప్పాలి. సాధార‌ణంగా ఒక ట‌ర్మ్ లో అమెరికా అధ్య‌క్షుడ్ని భార‌త ప్ర‌ధాని మ‌హా క‌లిస్తే ఒక‌ట్రెండు సార్లు మాత్ర‌మే. కానీ.. మోడీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌ర్వాత ఎన్నిసార్లు క‌లిసింది చూస్తున్న‌దే.

ఇదిలా ఉంటే.. మోడీ ఫారిన్ టూర్స్ కు సంబంధించిన ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఫారిన్ టూర్స్‌కు సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల్ని వెల్ల‌డించాల‌ని కోరారు. సామాజిక కార్య‌క‌ర్త నూత‌న్ ఠాకూర్ చేసుకున్న ద‌ర‌ఖాస్తును పీఎంవో తిప్పి పంపింది. ఈ పిటీష‌న్ అర్థం లేనిదని.. ప్ర‌ధాని ఖ‌ర్చుల వివ‌రాలు ఇవ్వ‌లేమ‌ని పీఎంవో కేంద్ర స‌మాచార అధికారి ప్ర‌వీణ్ కుమార్ వెల్ల‌డించారు. మ‌రి.. దీనిపై ఆర్టీఐ అప్పిలేట్ అథారిటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.