Begin typing your search above and press return to search.

ధోనీ కెప్టెన్సీ ఊడిందో ఎందుకో తేలింది

By:  Tupaki Desk   |   22 Feb 2017 3:25 PM GMT
ధోనీ కెప్టెన్సీ ఊడిందో ఎందుకో తేలింది
X
ఐపీఎల్‌ లో ఆటగాళ్ల వేలానికి ముందురోజు రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ ఇప్పటిదాకా జట్టు కెప్టెన్‌ గా వ్యవహరించిన మహేంద్రసింగ్ ధోనీకి ఉద్వాసన పలికిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న్ను త‌ప్పించ‌డం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణం తెర‌మీద‌కు వ‌చ్చింది. ధోనీ ప్ర‌వ‌ర్త‌న‌ - ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ లోపం కార‌ణంగా ఆయన్ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించార‌ట‌. ఫ్రాంఛైజీ యజమాని సంజయ్ గోయెంకాకు పడకపోవడం వల్లే అతడిపై వేటు పడిందని స్పష్టమైంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా గోయెంకానే ప్ర‌క‌టించాడు మ‌రి!

ధోని గ‌త సీజ‌న్లో స‌మావేశాల‌కు రాకుండా ఉండేవాడ‌ని, అంతేకాకుండా ఆయ‌న ఫోన్లో కూడా అందుబాటులోకి రాక‌పోయేవాడ‌ని గోయెంకా వ్యాఖ్యానించారు. టీం లీడ‌ర్‌ గా ఉన్న ధోనితో మేం మాట్లాడాల‌నుకుంటే చాలా ఇబ్బంది ప‌డేవాళ్లం. ఏజెంట్‌ అరుణ్‌ పాండే ద్వారా ఆయ‌న్ను ప‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. ఇక టీం మీటింగ్స్‌కు హాజ‌ర‌య్యేవాడు కాదు. పోనీ చ‌ర్చించిన విష‌యాల‌ను అయినా ఫీల్డ్‌ లో అమ‌ల్లో పెట్టేవాడా అంటే అదీ లేదు. నెట్ ప్రాక్టీస్‌ ల‌కు హాజ‌రు కాక‌పోయేది. ఇక ఫైన‌ల్ టీం ఎంపిక‌లోనూ సొంత నిర్ణ‌యాలు తీసుకున్నాడు. లెగ్‌ స్పిన‌ర్‌ ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మేం చెపితే ఆయ‌న ఆట‌తీరును చూడ‌లేద‌ని చెప్ప‌డం మాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది అంటూ తాము ఎంత‌గా ఇబ్బంది ప‌డ్డామో గోయెంకా వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా...ఇటీవలే జ‌ట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన త‌ర్వాత అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కు పగ్గాలు అప్పగించినట్లు ప్రకటించింది. ఇకనుంచి ధోనీ జట్టులో ఆటగాడిగా కొనసాగుతాడని వెల్లడించింది. ఈ సీజన్ నుంచి స్టీవ్‌ స్మిత్‌ ను జట్టు నాయకునిగా నియమిస్తున్నామ‌ని వివ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/