Begin typing your search above and press return to search.

బ్యాంకులకు టోపీ పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’లు

By:  Tupaki Desk   |   28 April 2016 4:45 AM GMT
బ్యాంకులకు టోపీ పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’లు
X
దీన్నో అధికార దోపిడీగా చెప్పాలి. కంపెనీలు పెట్టేసి.. బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవటం.. కంపెనీ నష్టాల కారణంగా చేతులెత్తేయటం.. వందలాది కోట్ల రూపాయిలు అప్పుల రూపంలో ఇచ్చేసిన బ్యాంకులు ఏమీ చేయలేక కిందామీదా పడిపోవటం గత కొద్దికాలంగా చూస్తున్నదే. ఇలా బ్యాంకులకు రూ.500 కోట్లకు పైనే అప్పు ఇచ్చి అడ్డంగా బుక్ అయిన వారికి సంబంధించిన సమాచారాన్ని తనకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్ బీఐని కోరిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలకు తగ్గట్లుగా ఆర్ బీఐ ఒక జాబితాను తయారు చేసి సుప్రీంకోర్టుకు ఇచ్చింది.

ఈ సందర్భంగా ఈ సమాచారాన్ని గుట్టుగా ఉంచాలని కోరింది. బ్యాంకులకు వందలాది కోట్లు ఎగ్గొట్టిన వారి వివరాల్ని ఎందుకు గుట్టుగా ఉంచాలన్న లాజిక్ ఏమిటో అర్థం కానిది. ఇదిలా ఉంటే.. బ్యాంకులకు కంపెనీలు ఎగ్గొట్టిన అప్పుల విలువ తెలిస్తే తెల్లముఖం వేయాలి. అంత పెద్ద మొత్తం అంత దర్జాగా పక్కదారి పట్టించారా? అని ఆశ్చర్యపోవాల్సిందే. బ్యాంకులకు డిఫాల్టర్లు.. ఎగవేత మొత్తం అక్షరాల రూ.5లక్షల కోట్లు. ఇందులో రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఎగవేసిన వారికి సంబంధించి వివరాలు తాజాగా బయటకు పొక్కటం సంచలనంగా మారింది.

ఆర్ బీఐ ఇచ్చిన రహస్య నివేదికను బయట పెట్టాలా? వద్దా? అన్న చర్చ ఓపక్క జరుగుతుంటే.. మరోవైపు ఆర్ బీఐ ఇచ్చిన జాబితాను న్యూస్ లాండ్రీ బయటకు పెట్టటం పెను సంచలనంగా మారింది. న్యూస్ లాండ్రీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బ్యాంకులను మోసంచేసిన మాల్యాల తరహా పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక.. బ్యాంకులకు పంగనామాలు పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’ల్ని చూస్తే..

1. ఉషా ఇస్పాత్ రూ.16,911 కోట్లు

2. లాయిడ్ స్టీల్ రూ.09,478 కోట్లు

3. హిందుస్థాన్ కేబుల్స్ రూ.04,917 కోట్లు

4. హిందుస్థాన్ ఫోటో పిల్స్మ్ రూ.03,929 కోట్లు

5. జూమ్ డెవలపర్స్ రూ.03,843 కోట్లు

6. ప్రకాష్ ఇండస్ట్రీస్ రూ.03,665 కోట్లు

7. క్రేన్స్ సాఫ్ట్ వేర్ రూ.03,580 కోట్లు

8. ప్రాగ్ బాస్మీ సింథటిక్స్ రూ.03,558 కోట్లు

9. కింగ్ ఫిషర్ రూ.03,259 కోట్లు

10. మాళవిక స్టీల్ రూ.03,057 కోట్లు