Begin typing your search above and press return to search.

బ్రిటీష్ రాణి సేవలో ఉద్యోగం..26లక్షల జీతం

By:  Tupaki Desk   |   22 May 2019 7:44 AM GMT
బ్రిటీష్ రాణి సేవలో ఉద్యోగం..26లక్షల జీతం
X
రవి అస్తమించని రాజ్యాన్ని నెలకొల్పారు బ్రిటీష్ రాజ కుంటుంబీకులు. 1947కు ముందు బ్రిటీష్ రాజ్యం కింద ప్రపంచంలోని చాలా దేశాలు ఉండేవి. అలాంటి రాజకుటుంబీకులు ఇప్పటికీ బ్రిటన్ లో ఉన్నారు. అయితే పాలన మాత్రం ప్రజాస్వామికంగా ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వానిదే.. రాజకుటుంబం మాత్రం ప్రభుత్వంలో జోక్యం చేసుకోదు..

తాజాగా బ్రిటీష్ రాజకుటుంబం కోసం పని చేయాలనుకునే ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్రిటీష్ రాణి ఎలిజిబెత్-2 ఉనికిని ప్రపంచానికి గొప్ప చాటే జాబ్ చేయాలనుకునే మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్ సైట్ లో ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది.

కొత్తగా ఎంపికయ్యే మీడియా మేనేజర్ రాణిగారిని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రియేటివిటీగా సరికొత్త మార్గాలను అన్వేషించాలి. ఆమె గొప్పతనాన్ని చాటిచెప్పాలి. ఇందుకుగాను అల్లాటప్పా జీతం ఇవ్వడం లేదు. ఏకంగా నెలకు 30వేల బ్రిటీష్ పౌండ్ల జీతం ఇస్తున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 26,57,566 రూపాయల వేతనమన్నమాట.. నెలకు ఇంత జీతం అంటే పెద్ద సాఫ్ట్ వేర్ కొలువు తో సమానమన్న మాట..

ఇక జీతం తోనే బ్రిటీష్ ప్యామిలీ సరిపెట్టలేదు. ఆ మీడియా మేనేజర్ కు జీతంలో 15శాతం పెన్షన్ పథకం.. 33రోజుల వార్షిక సెలవులు, ఉచిత భోజంన, వారానికి ఐదురోజులే పని కల్పించారు. ఇక ఉద్యోగానికి అర్హతలు కూడా తక్కువే. డిగ్రీతోపాటు వెబ్ సైట్ లో పనిచేసిన అనుభవం ఉంటే చాలు. ఇక వీటికి అదనంగా ఫొటోగ్రఫీలో , వీడియో నైపుణ్యాలు చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రాధాన్యం బట్టి చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వీరు చేయాల్సిన పని ఏంటంటే.. బ్రిటీష్ రాణి గొప్పతనంపై డిజిటల్, సోషల్ మీడియాలో కంటెంట్ ను క్రియేట్ చేసి ప్రచారం చేయాలి. కొత్త డిజిటల్ మాధ్యమాల మీద పూర్తిగా పట్టు ఉన్నవారు కావాలని తెలిపారు. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యం, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రోజువారీ వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను రాసి పోస్టు చేయాలి. ఇలా మీడియా మేనేజర్ గా మీరు సూట్ అవుతారనుకుంటే వెంటనే వెబ్ సైట్ లో చూసి ఓ దరఖాస్తు పడేయండి.. రాణి సేవల తరించండి..