యువ ఎస్పీ అందానికి అమ్మాయి ఫిదా!

Wed Jun 20 2018 13:52:08 GMT+0530 (IST)

సాధారణంగా సినీ హీరోలకు - క్రికెటర్లకు - సెలబ్రిటీలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వారితో సెల్ఫీలు దిగేందుకు - వారి ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు అమ్మాయిలు పోటీపడుతుంటారు. వారినే తమ కలల రాకుమారులుగా ఊహించుకుంటూ.....తమ అభిమాన సెలబ్రిటీలపై మనసుపారేసుకున్న కొందరు అమ్మాయిలు ప్రేమలోకంలో విహరిస్తుంటారు. ఇక వారిని కలిసి మాట్లాడే చాన్స్ వస్తే వారిపై తమకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచేందుకు ఏ మాత్రం సందేహించరు. అయితే కేవలం ఈ తరహా సెలబ్రిటీలకే కాదు....ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఆ యంగ్ డైనమిక్ ఆఫీసర్ మీద మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను వ్యక్తపరిచేందుకు...ఏకంగా అతడు పనిచేసే చోటుకు వచ్చి నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ యువతి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సచిన్ అతుల్కర్ అనే యువ ఐపీఎస్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యమిచ్చే అతుల్....రోజుకు 70 నిమిషాల పాటు జిమ్ లో గడుపుతుంటారు. దీంతో ఫిట్ గా యంగ్ ఉన్న అతుల్ ...కు సోషల్ మీడియాలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అయితే పంజాబ్ లోని హోషియార్ పూర్ లో సైకాలజీలో పీజీ చేస్తున్న 27 ఏళ్ల యువతి....సోషల్ మీడియాలో అతుల్ ఫొటోలను చూసి మనసు పారేసుకుంది. ఇంకేముంది తన ప్రేమను వ్యక్తపరిచేందుకు వెంటనే అతుల్ ను కలవాల్సిందేనంటూ 3 రోజుల క్రితం ఉజ్జయినిలో వాలిపోయింది. అయితే అక్కడి పోలీసులు ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినా వినలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులను పిలిపించినా...వారితో పంజాబ్ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇక లాభం లేదనుకొని పోలీసులు ఆమెను పంజాబ్ వెళ్లే రైలును ఎక్కించాలని ప్రయత్నించారు. అయితే తాను అతుల్ ను కలవాల్సిందేనని లేదంటే కదిలే రైలు నుంచి దూకుతానని బెదిరించింది. దీంతో ఆమెను తిరిగి ఉజ్జయిని తీసుకువచ్చారు. ఓ అధికారిగా తాను ఎవరితోనైనా కలుస్తానని అయితే తన వ్యక్తిగత విషయాల్లో నచ్చినట్లు వ్యవహరిస్తానని అతుల్ చెప్పారు. మరి అతుల్ తో ఆ యువతి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.