Begin typing your search above and press return to search.

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం..

By:  Tupaki Desk   |   18 Feb 2019 8:20 AM GMT
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం..
X
భారత సైన్యం పుల్వామా దాడికి సూత్రధారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేయడంలో కీలక సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీనీ సైన్యం మట్టుబెట్టి అమరుల జవానుల ఆత్మకు నివాళులర్పించింది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో దాడికి పాల్పడిన సంఘటన తెల్సిందే. పుల్వామాలో సీఆర్పీఎప్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడిచేసి 43మంది జవాన్ల మృతికి కారణమయ్యారు. ఈ సంఘటనపై యావత్ భారత్ రగిలిపోయింది. అమరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని యావత్ భారతావని కోరుకుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం సైన్యం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది.

సైన్యం సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఆదివారం రాత్రి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. సైన్యంపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించి ఓ భనవంలో ఉగ్రవాదులు దాక్కున్నారు. ముష్కరులను హతమార్చేందుకు సైన్యం తీవ్రంగా శ్రమించి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ ఆపరేషన్లో మృతిచెందిన రషీద్ ఘాజీ జైషే అధినేత మసూద్ అజహార్ కు అత్యంత నమ్మకస్తుడు. రషీద్ ఆఫ్గనిస్తాన్లో ని తాలిబాన్ గ్రూపులో శిక్షణ పొంది ఐఈడీలు తయారు చేయడం, వాటిని పేల్చడంలో ఎక్సపర్టయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తోపాటు దక్షిణ కశ్మీర్ లో యువతను భారత్ కు వ్యతిరేకంగా ఉసిగొట్టడంలో ముఖ్య పాత పోషించేవాడు.

తాజాగా పుల్వామాలో జరిగిన ఘటనలో రషీద్ ప్రభావంతోనే అదిల్ అహ్మద్ దార్ సూసైడ్ బాంబర్ గా మారాడు. కొద్దిరోజుల క్రితం రతన్ పోరాలో జరిగిన ఎన్ కౌంటర్లో తృటిలో తప్పించుకోవడంతో పుల్వామా దాడికి తెగబడ్డారు. దీంతో భారత్ సైన్యం ఎలాగైనా రషీద్ ను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రషీద్ సైన్యంపై కాల్పులకు తెగబడగా ఎదురు కాల్పుల్లో రషీద్ ను సైన్యం హతమర్చింది.

ఎట్టకేలకు అమర జవానుల ఆత్మకు భారత సైన్యం నివాళులర్పించింది. అయినప్పటికీ ప్రస్తుతం కశ్మీర్ ప్రజల్లో ఓ భయాందళన నెలకొంది. ఎప్పడు ఏం జరుగుతుందా అని ఆందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో కొద్దిరోజుల్లో పరిస్థితి మామూలు స్థితికి చేరుకోవచ్చు.