Begin typing your search above and press return to search.

పుల్వామా దాడి.. జవాన్ ఆఖరి వీడియో

By:  Tupaki Desk   |   23 Feb 2019 9:51 AM GMT
పుల్వామా దాడి.. జవాన్ ఆఖరి వీడియో
X
పుల్వామా ఉగ్రవాద దాడిలో 43మంది భారత సైనికుల మరణం కలిచి వేసిన సంగతి తెలిసిందే.. బస్సులో బయలు దేరిన సైనికులను ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసి హతమార్చాడు. అయితే అదే బస్సులో బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒక జవాన్ చివరిసారిగా ఓ వీడియో రికార్డు చేసుకొని తన భార్యకు పంపాడు. తాజాగా ఈరోజు చూసుకున్న ఆమె వీడియో చూసి కన్నీరు మున్నీరు పెట్టుకుంది.

పుల్వామా దాడిలో అమరుడైన జవాన్లలో 76వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్ ది పంజాబ్ లోని తర్న్ తరన్ ప్రాంతం. ఈయన పుల్వామాకు బస్సులో వెళ్తుండగా.. చివరిసారిగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. సీఆర్పీఎఫ్ బస్సులో ప్రయాణిస్తూ మాట్లాడుతూ బస్సును చూపిస్తూ వీడియో రికార్డు తీసి భార్యకు పంపించాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆత్మాహుతి దాడిలో చనిపోయాడు. అయితే భర్త సుఖ్జీందర్ సింగ్ చనిపోయిన బాధలో ఉన్న భార్య ఇన్నాళ్లు మొబైల్ ఫోన్ చూసుకోలేదు. శుక్రవారం చూసి దాడి జరగక ముందు కొన్ని క్షణాల ముందు ఎలా ఉన్నాడో చూసి కంటతడి పెట్టింది.

ఈ వీడియోలో బస్సులోని ఇతర జవాన్లతోపాటు సుఖ్జీందర్ సింగ్ కనిపించాడు. బయటా మంచుతో కప్పబడిన ప్రాంతాన్ని రికార్డ్ చేశాడు. బస్సును కూడా రికార్డు చేశారు. ఇది తీసిన కొద్ది సేపటికే బస్సుపై బాంబు దాడి జరిగి అందరూ చనిపోయారు. సుఖీందర్ 2003లో సీఆర్పీఎఫ్ లో చేరాడు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఈ వీడియో మీడియాలో కూడా వైరల్ అయ్యింది. వీర సైనికుల చివరి చూపులను చూసి వారి కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు.