ఫృథ్వీ లీక్స్.. డిసెంబర్ లో టీడీపీ జాతకాలు

Thu Nov 08 2018 10:34:05 GMT+0530 (IST)

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఫృథ్వీ ఏపీ రాజకీయాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పార పట్టారు.  గరుడ పురాణం అంటూ టీడీపీ అల్లుతున్న డ్రామా రాజకీయాలను ఏకిపారేశాడు. టీడీపీ గరుడ పురాణానికి పోటీగా త్వరలోనే తాను గవ్వల పురాణం బయటపెడుతున్నానని.. అందులో టీడీపీ నేతల జాతకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయని హెచ్చరించారు.టీడీపీ నేతల జాతకాల గవ్వలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయని ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాస్తున్నామని.. డిసెంబర్ లోనే బయటపెడుతున్నట్టు పేర్కొన్నారు.  వాళ్లు చెప్పేది నిజమని నమ్మితే.. మా గవ్వల పురణాన్ని కూడా జనం నమ్మతారని ఫృథ్వీ అన్నారు.

జగన్ హత్యను కూడా రాజకీయం చేసి ముసి ముసి నవ్వులు నవ్విన టీడీపీ నేతల తీరును ఫృథ్వీ తీవ్రంగా ఖండించారు. ఒక జంతువుకు దెబ్బ తగిలితే మిగతా 10 జంతువులు గుమిగూడి సానుభూతి తెలుపుతాయని.. టీడీపీ ఇలాంటి మానవత్వం కూడా లేదని ఫృథ్వీ మండిపడ్డారు. కత్తి చిన్నదా పెద్దదా సమస్యకాదని.. అది హత్యాయత్నం జరిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నారు. కత్తి భుజానికి తగిలింది కాబట్టి పట్టించుకోవడం లేదని..అదే మెడకో.. గుండెల్లో దిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదే చంద్రబాబుకు తగిలితే ప్రపంచం బద్దలైనట్టు టీడీపీ - ఆయన మీడియా రాద్ధాంతం చేస్తారని.. కానీ ప్రతిపక్ష నాయకుడికి జరిగితే టీడీపీ నేతలు వెకిలి నవ్వులు నవ్వారని విమర్శించారు.

చంద్రబాబుకు ఇదే దెబ్బ తగిలితే సింపథీ కోసం ఎయిర్ పోర్టులోనే పొర్లు దండాలు వేసి నానా హంగామా చేసేవారని..కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం సింహంలా లేచి నవ్వుతూ వెళ్లిపోయారు.. దటీజ్ జగన్ అంటూ ఫృథ్వీ కొనియాడారు. బాబుకు తగిలితే ఇప్పటికే రాష్ట్రమంతా అల్లకల్లోలం చేసేవారని.. అదే జగన్ చాలా మెచ్చురిటీగా ఆలోచించి వివాదాన్ని పెద్దది చేయలేదని స్పష్టం చేశారు.

ఇక రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి హంగ్ లు - బొంగులు రావని.. జనాల తీర్పు వైసీపీకి వన్ సైడ్ గా ఉండబోతోందని ఫృథ్వీ స్పష్టం చేశారు. వైసీపీ ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేశారు.