Begin typing your search above and press return to search.

మోడీతో అంత ద‌గ్గ‌ర‌గా మాట్లాడే ఆమె ఎవ‌రు?

By:  Tupaki Desk   |   13 March 2018 5:28 AM GMT
మోడీతో అంత ద‌గ్గ‌ర‌గా మాట్లాడే ఆమె ఎవ‌రు?
X
జాతీయ రాజ‌కీయాల్ని.. జాతీయ కార్య‌క్ర‌మాల్ని రెగ్యుల‌ర్ గా ఫాలో అయ్యేవారికి నిన్న‌టి న్యూస్ లో ఒక మ‌హిళ ఆస‌క్తిక‌రంగా క‌నిపించారు. ఆమె ఎవ‌రు? అన్న ఆస‌క్తి ప‌లువురిలో వ్య‌క్త‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ లు నిన్న బెనార‌స్ లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రికి ద‌గ్గ‌ర‌గా ఒక మ‌హిళ క‌నిపించారు. ఆమె.. మోడీకి ద‌గ్గ‌ర‌గా ఆయ‌న‌తో మాట్లాడ‌టం క‌నిపించింది. నిజానికి ఈ ప‌ర్య‌ట‌న‌లోనే కాదు.. ప‌లు విదేశీ ప్ర‌ముఖులు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆమె ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంటారు. ఆమెతో మోడీ మాట్లాడుతుంటారు. ఇంత‌కీ ఆమె ఎవ‌రు? మోడీ ద‌గ్గ‌ర ఆమె ఏం చేస్తుంటారు? అన్న‌ది చూస్తే.. ఆమె పేరు నీలాక్షీ సిన్హా. ఆమె ప్ర‌ధాని మోడీకి అధికారిక అనువాద‌కురాలు.

ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే విదేశీ ప్ర‌ముఖులు భార‌త్‌ కు వ‌చ్చిన‌ప్పుడు మోడీ గుజ‌రాతీలో మాట్లాడితే.. ఆమె ఆ మాట‌ల్ని ఆయా ప్ర‌ముఖులకు చెందిన మాతృభాష‌లో మోడీ మాట‌ల్ని త‌ర్జుమా చేస్తారు. విదేశీ భాష‌ల్ని హిందీ..గుజ‌రాతీలోకి అనువాదం చేయ‌టంలో ఆమె నిపుణురాలు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె 14 ఫారిన్ టూర్లలో మోడీకి ఇంట‌ర్ ప్రెట‌ర్ గా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం నీలాక్షి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ ట‌ర్న‌ల్ అఫైర్స్ లో వెస్ట్ ఆఫ్రికా డివిజ‌న్ లో డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్య‌క్షుడి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోడీ గుజ‌రాత్ లో చెప్పే మాట‌ల్ని ఆమె.. ఫ్రెంచ్ లో త‌ర్జుమా చేశారు. తానేం చెప్పాల‌నుకునే విష‌యాన్ని మోడీ ఎప్ప‌టిక‌ప్పుడు ఆమెకు చెప్పాల్సి ఉంటుంది కాబ‌ట్టి.. ఆమె మోడీకి అంత ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌గ‌లిగారు. మాట్లాడ‌గ‌లుగుతున్నారు.