Begin typing your search above and press return to search.

ప్రియాంక ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   24 Jan 2019 9:30 AM GMT
ప్రియాంక ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదేనా?
X
హ‌డావుడిగా ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ చేశారంటే.. అందులో ఏదో మ‌ర్మం ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీ క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లుగా ఆ పార్టీ అధినేత క‌మ్ సోద‌రుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేశారంటూ అందులో ఏదో ఒక మ‌త‌ల‌బు ఉంటుంద‌న‌టంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు.. యూపీని రెండు ముక్క‌లుగా విభ‌జించి.. ఒక ముక్క‌కు సంబంధించిన బాధ్య‌త‌ల్ని ప్రియాంక‌కు అప్ప‌జెబుతున్న‌ట్లుగా పేర్కొన‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రి ప్రియాంక ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నార‌న్న‌ది చెక్ చేస్తే.. ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ప్ర‌స్తుతం ప్రియాంక అమెరికాలో ఉన్నారు.

ఎందుకు? ఏ ప‌ని మీదా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి. కాంగ్రెస్ పార్టీ కీల‌క ప‌ద‌విని చేపట్ట‌నున్న ప్రియాంక‌.. ఆ ప‌ని ఎప్పుడు చేస్తారంటే వ‌చ్చే నెల (ఫిబ్ర‌వ‌రి 1) లో చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అంటే.. ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు అందుకోవ‌టానికి మ‌రో తొమ్మిది రోజులు ఉంది. త‌న సోద‌రి దేశంలో లేని వేళ‌.. ఆమెకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం రాహుల్ కు ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ప‌ద‌విని ఫిబ్ర‌వ‌రి 1న చేప‌డ‌తార‌ని.. ప్రెస్ తో ఫిబ్ర‌వ‌రి 2న స‌మావేశం అవుతార‌ని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే..తాను చేప‌ట్ట‌నున్న రోల్ కు సంబంధించిన ప్రిప‌రేష‌న్.. వ్యూహ క‌స‌ర‌త్తులో భాగంగా ప్రియాంక అమెరికాకు వెళ్లారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

మ‌రోవైపు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న ఫిబ్ర‌వ‌రి లోనే విడుద‌ల అవుతుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి వేళ‌.. ప్రియాంకకు పార్టీకి చెందిన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌టం చూస్తే.. ప‌క్కా ప్లాన్ తో కాంగ్రెస్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్రియాంక నియామ‌కం లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించింది ఎంత మాత్రం కాదంటూ రాహుల్ చెబుతున్న తీరు చూస్తేనే.. మోడీకి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ ప్ర‌యోగించిన బ్రాహ్మాస్త్రం.. ప్రియాంక అని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న సోద‌రి గురించి.. ఆమె గొప్ప‌త‌నం గురించి.. ఆమె క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే తీరు గురించి గొప్ప‌లు చెప్పుకున్న రాహుల్‌.. మ‌రి.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం సూటిగా స‌మాధానం చెప్ప‌లేదు. ఆమె కావాల‌నుకుంటే పోటీ చేస్తార‌ని చెప్ప‌టం ద్వారా.. పోటీకి సంబంధించిన ద్వారాల్ని మూయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. అనారోగ్యంతో ఉన్న త‌న త‌ల్లి ప్రాతినిధ్యం వ‌హించే రాయ‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రియాంక పోటీ చేయ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. త‌న ఎంట్రీతో పార్టీని ఉత్తేజితం చేయ‌టం.. స‌మ‌రోత్సాహాన్నిపెంచ‌టంతో పాటు.. మోడీని దెబ్బేయ‌టం ప్రియాంక ప్రైమ‌రీ ల‌క్ష్యాలుగా చెప్ప‌క త‌ప్ప‌దు.