Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో కేసీఆర్ ను పార్టీ పెట్ట‌మ‌ని ఒత్తిడి

By:  Tupaki Desk   |   26 May 2017 8:16 AM GMT
ఆంధ్రాలో కేసీఆర్ ను పార్టీ పెట్ట‌మ‌ని ఒత్తిడి
X
ఈ రోజు న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి మొద‌టి పేజీలో భారీ ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌చురిత‌మైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రాలో పార్టీ పెట్టాల‌న్న విన‌తులు.. ఈ మొయిళ్లు ఇటీవ‌ల కాలంలో భారీగా వ‌స్తున్న‌ట్లుగా పేర్కొంది. ఏపీలోనూ పార్టీని విస్త‌రించాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ ఊపందుకుంటోంద‌ని వెల్ల‌డించింది. ఇదే విష‌యాల్ని ప్ర‌స్తావిస్తూ పెద్ద ఎత్తున ఈమొయిళ్లు వ‌స్తున్న‌ట్లుగా స‌ద‌రు ప‌త్రిక పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌గ‌లిగే ఏకైక నాయ‌కుడు కేసీఆరేన‌ని.. స‌మ‌స్య‌ల్ని అర్థం చేసుకోవ‌టంలోనూ.. వాటిని ప‌రిష్కరించ‌టంలోనూ ఆయ‌న పంథా అనుస‌ర‌ణీయ‌మ‌ని పేర్కొంటూ ఈమొయిళ్లు వ‌స్తున్నట్లు వెల్ల‌డించింది.

కేసీఆర్ లాంటి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం.. ఏపీలోని తెలుగువాళ్ల‌కు కావాల‌ని.. టీఆర్ ఎస్‌ ను ఏపీలో కూడా షురూ చేయాల‌ని లేదా ప్రారంభించుకోవ‌టానికి అనుమ‌తులు ఇవ్వాలని కోరుతున్నార‌ట‌. ఈ క‌థ‌నంలో అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా వెళ్లిన కేసీఆర్ కు ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు భారీ ఎత్తున ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌క‌టం.. బ్యాన‌ర్లు క‌ట్ట‌టం లాంటివి చూసి ప్ర‌ధాని మోడీ సైతం ఆశ్చ‌ర్యానికి గురైన విష‌యాన్ని గుర్తు చేసింది.

కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆంధ్రా ప్రాంతంలోని ప‌లు జిల్లాల్లో పెద్ద ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించ‌టం.. ప‌లు కార్య‌క్ర‌మాల్ని జ‌ర‌ప‌టం లాంటివి పేర్కొంటూ.. టీఆర్ఎస్ గ‌తంలో ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా అభ్య‌ర్థుల్ని బ‌రిలో నిలిపిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది.

2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈసీ నిబంధ‌న‌లకు త‌గ్గ‌ట్లు పార్టీ చిహ్నం కోసం నామ‌మాత్రంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి నిల‌ప‌గా.. గ‌ణ‌నీయ‌మైన ఓట్లు ప‌డిన విష‌యాన్ని గుర్తు చేసింది. తాజాగా ఎపిసోడ్ లో అమిత్ షా పై కేసీఆర్ ఫైరింగ్‌ను ప‌లువురు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు తెగ మెచ్చుకున్నార‌ని.. ఏపీలో కేసీఆర్ కు ఉన్న ఫాలోయింగ్‌ను ఈ క‌థ‌నంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. ఉన్న‌ట్లుండి.. ఆంధ్రాలో పార్టీ పెట్టాల‌న్న విన‌తిపై కేసీఆర్ కుటుంబ ప‌త్రిక‌లో భారీ ఎత్తున క‌థ‌నాలు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/