Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ప్రసంగం.. హైలెట్స్ అవే!

By:  Tupaki Desk   |   20 Jun 2019 7:58 AM GMT
రాష్ట్రపతి ప్రసంగం.. హైలెట్స్ అవే!
X
కొత్తగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తమ ప్రభుత్వ లక్ష్యాలను ప్రకటిస్తూ ప్రసంగించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. గత ఐదేళ్లూ దేశాన్ని నడిపించిన మోడీనే ఇప్పుడు మళ్లీ ప్రధానిగా ఎన్నిక కావడంతో.. అప్పటి అంశాలనూ ప్రస్తావిస్తూ - తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. పెద్దగా కొత్తదనం ఏమీ లేదు రాష్ట్రపతి ప్రసంగంలో. బీజేపీ పెట్టుకున్న లక్ష్యాల గురించినే ఎక్కువ గా ప్రస్తావించినట్టుగా ఉన్నారు.

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపే అంశం గురించి ప్రస్తావించారు. తరచూ ఎన్నికల వల్ల అభివృద్ధి ఆగుతోందని, అందుకే దేశంలో ఎన్నికల ప్రక్రియను తక్కువ విడతల్లో పూర్తి చేసే ఆలోచనను అమలు పెడతామని రాష్ట్రపతి ప్రకటించారు.

ట్రిపుల్ తలాక్ వంటి సంప్రదాయాలు మహిళల పురోగమనాన్ని అడ్డుకునేవిలా ఉన్నాయని, వాటిని సమూలంగా తొలగించాలన్నారు.

రెండు వేల ఇరవై రెండు తో దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉన్నాయని, ఇలాంటి తరుణంలో నవభారతం కోసం నిబద్ధతతో పని చేయబోతున్నట్టుగా ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.

రైతులు - జవాన్ల కుటుంబాలకు అండగా నిలవబోతున్నట్టుగా తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని భారీ ఎత్తున అందించబోతున్నట్టుగా వివరించారు.

ఉగ్రవాదాన్ని అరికట్టే చర్యల - శాస్త్రసాంకేతిక రంగాల్లో రాణింపు తదితర అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టుగా మోడీ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.