Begin typing your search above and press return to search.

20మంది ఎమ్మెల్యేల‌పై వేటుకు రాష్ట్రప‌తి ఓకే

By:  Tupaki Desk   |   21 Jan 2018 11:56 AM GMT
20మంది ఎమ్మెల్యేల‌పై వేటుకు రాష్ట్రప‌తి ఓకే
X
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత - ఢిల్లీ అర‌వింద్ కేజ్రీవాల్‌ కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటూ ఈసీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అనర్హతపై నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారంటూ ఎన్నికల సంఘం ఆరోపించింది. ఈ సమస్యకు సంబంధించి ఎన్నికల సంఘం తన ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కు పంపించింది. దీంతో ఆ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 63 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుతో ప్రస్తుతం వారి బలం 43కు చేరింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ తన రిటైర్మెంట్‌ కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో...త్వరలో ఢిల్లీలో మినీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.