Begin typing your search above and press return to search.

అమిత్ షా ఇంట్లో పీకే..గోబెల్స్ ప్రచారం..నిజం ఇది

By:  Tupaki Desk   |   17 March 2018 4:58 PM GMT
అమిత్ షా ఇంట్లో పీకే..గోబెల్స్ ప్రచారం..నిజం ఇది
X
`ఏపీ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా నివాసంలో జరిగిన భేటీకి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్‌ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌... బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయ్యారు. ఈ భేటీకి హాజరైన ప్రశాంత్‌ కిషోర్‌... ఏపీలో పార్టీ పరిస్థితులపై వివ‌రించి వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌ తో పొత్తుకు లైన్ క్లియ‌ర్ చేశారు` ఇది ఉద‌యం నుంచి ప‌చ్చ బ్యాచ్ చేస్తున్న ప్రచారం! వారి అనుకూల మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు!! అయితే ఇందులో ఇసుమంతైనా నిజం లేద‌ని...గోబెల్స్‌ కు స‌మానమైన ఈ ప్రచారాన్ని క‌ర్త‌ - క‌ర్మ - క్రియా అంతా టీడీపీయేన‌ని స్ప‌ష్ట‌మైంది.

`వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ కిషోర్ పైనే ఆధారపడ్డాయి` అంటూ టీడీపీ హోరెత్తించిన ప్ర‌చారం ప‌లు వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యప‌రిచింది. వైకాపా రాజకీయ వ్యూహకర్తగా ఏడాదిన్న కాలంగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీ వ్యూహకర్తగా నియమితులై ఏపీ నాయకులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడుతో భేటీలో పాల్గొనడం ఆ రెండు పార్టీల లాలూచీ రాజకీయాలకు నిదర్శనం కాదా?. తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రాగానే వైకాపా ఎన్డీయే గూటికి చేరేందుకు సిద్ధంగా ఉందంటూ తాము చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలనడానికి ఇదే నిదర్శనమని టీడీపీ వర్గాలు బ్యాండ్ బ‌జాయించి మ‌రీ చెప్పాయి. ఈ ప్ర‌చారం ఈ నోటా ఆనోటా పీకే టీంకు చేరింది. దీంతో ప‌చ్చ‌బ్యాచ్ షాక్ అయ్యే క్లారిటీ ఇచ్చింది.

ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్‌ను జ‌త‌చేస్తూ మ‌రీ...`పూర్తిగా అవాస్త‌వ క‌థ‌నం. అస‌త్య‌క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేసేందుకు దురుద్దేశ‌పూరితంగా చేస్తున్న ప్ర‌చారం ఇది. ఇలాంటి ప్ర‌చారం గురించి వ‌దిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్ర‌శాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది.అంతేకాకుండా బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియ‌మించ‌డం కూడా పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొంది.