Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ ఓకే..టీఆర్ఎస్ సీటుకు నాట్ ఓకే..

By:  Tupaki Desk   |   1 Jan 2019 6:27 AM GMT
ప్రకాష్ రాజ్ ఓకే..టీఆర్ఎస్ సీటుకు నాట్ ఓకే..
X
వారిద్దరి మనసులు కలిశాయి.. ఇద్దరిలోనూ అదే ముక్కుసూటి తనం.. ఇద్దరూ తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనేంత మోనార్క్ లు.. అంతటి భీకరులు సీఎం కేసీఆర్, నటుడు ప్రకాష్ రాజ్ లు.. ఇద్దరూ ఒకే క్లాజ్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరిట కొద్దిరోజులుగా దక్షిణాది రాజకీయ నేతలను కలిశారు. మాట్లాడారు. కానీ రాజకీయాల్లోకి ప్రకాష్ రాజ్ వస్తాననగానే సీన్ మారిపోయింది. కేసీఆర్ కు ఎంతో సాన్నిహితుడిగా మారిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా టీఆర్ఎస్ నుంచి కాకుండా స్వతంత్రుడిగా ఎందుకు పోటీచేయబోతున్నారనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

సౌతిండియా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇచ్చిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే కొద్దిరోజులుగా సినిమాల్లో కంటే రాజకీయంగానే ప్రకాష్ రాజ్ ఫోకస్ అయ్యారు. తన సన్నిహితులు కన్నడ రచయిత్రి గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. బీజేపీ, నరేంద్రమోడీ యే ఆమె హత్యకు కారణమని దుమ్మెత్తిపోశారు. అప్పటి నుంచి నరేంద్రమోడీ విధానాలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో బీజేపీపై పెద్ద యుద్ధమే ప్రకాష్ రాజ్ నడిపిస్తున్నారు.

దక్షిణాది వ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రకాష్ రాజ్ ఏ రాష్ట్రం నుంచి అయినా పోటీచేసే అవకాశం ఉంది. ఆయన స్వతహాగా కన్నడవాసి అయినా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. బహుషా కన్నడలోనే పోటీచేస్తారని భావిస్తున్నారు. సినిమాల ద్వారా ఆయన మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఫాం హౌస్ తోపాటు ఇళ్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ మాత్రం టీవీల ముందుకు వచ్చి కేసీఆర్ గెలవాలని.. టీఆర్ఎస్ తెలంగాణకు అవసరమని కుండబద్దలు కొట్టారు. ఇక కేసీఆర్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ పేరిట కర్ణాటక, తమిళనాడులో కూడా పయనించారు.

నిజానికి ప్రకాష్ రాజ్ కు ఎంపీ సీటు ఇచ్చి ఆయన్ను ఎంపీగా చేయడం కేసీఆర్ కు ఏమంత కష్టం కాదు.. కానీ టీఆర్ఎస్ సిద్ధాంతాలకు , ప్రకాష్ రాజ్ కు కొన్ని విషయాల్లో పడదు. ప్రకాష్ రాజ్ ఇప్పుడు మోడీ వ్యతిరేక విధానాలతోనే ముందుకెళ్తున్నారు. ఆయన్ను కేసీఆర్ కనుక ఎంపీ చేస్తే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతారు. టీఆర్ఎస్ కు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ముందుకెళ్తోంది. ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా.. తేడా కొడితే కేసీఆర్ సపోర్టు మోడీ టీంకే.. బీజేపీకి మద్దతివ్వడం తప్ప కేసీఆర్ వేరే ఆప్షన్ లేదు. అందుకు ప్రకాష్ రాజ్ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ చేర్చుకోలేదని తెలుస్తోంది. మోడీని తిడుతున్న ప్రకాష్ రాజ్ కు అందుకే కేసీఆర్ టికెట్ ఇవ్వడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ విధానపరమైన అభిప్రాయభేదాలు తప్పితే ప్రకాష్ రాజ్ పై కేసీఆర్ కు ఎలాంటి కోపతాపాలు లేవంటున్నారు..మిగతా అన్ని విషయాల్లో రెడ్ కార్పెట్ స్వాగతం ప్రకాష్ రాజ్ కు కేసీఆర్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు..