Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ ఆస్తులు ఎంతంటే.?

By:  Tupaki Desk   |   24 March 2019 4:34 AM GMT
ప్రకాష్ రాజ్ ఆస్తులు ఎంతంటే.?
X
బెంగళూరు సెంట్రల్ నుంచి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆప్, బీఎస్సీ మద్దతుతో భారీ ర్యాలీ నిర్వహించి పోటీలో నిలిచారు. తాజాగా నామినేషన్ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఈసీకి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తనకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.31 కోట్లుగా ప్రకటించారు.

నామినేషన్ తో పాటు సమర్పించిన ఆస్తుల వివరాలలో తనకు రూ.26.59 కోట్ల స్థిరాస్థులు, రూ.4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

గత ఏడాది సమయంలో సినిమాల ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.25వేల నగదుతోపాటు పెట్టుబడుల రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 1.88 కోట్ల విలువ చేసే వాహనాలు ఉన్నాయని తెలిపారు.

ఇక తన భార్య రష్మి వర్మ పేరిట రూ.20.46లక్షల చరాస్తి, రూ.35 లక్షల స్థిరాస్థి.. 18లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. చిక్కమగళూరులో తనపై ఒక కేసు దాఖలైందని ప్రకాష్ రాజ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.