Begin typing your search above and press return to search.

షాకు స్ట్రాంగ్ ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:45 AM GMT
షాకు స్ట్రాంగ్ ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
X
ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే దేశం.. ఒకే కరెన్సీ.. ఒకే దేశం.. ఒకే జెండా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే దేశంగా ఉన్న వారంతా ఓకే చెబుతారు. కానీ.. ఒకే దేశం ఒకే మతం.. ఒకే దేశం ఒకే భాష.. ఒకే దేశం..ఒకే కల్చర్.. ఒకే దేశం.. ఒకే కులం.. లాంటి మాటలు వినటానికే చిరగ్గా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వంలా అందరిని కలిపి ఉంచే భారత తత్త్వాన్ని సరిగా అర్థం చేసుకోని మోడీషాలాంటోళ్లు తమకు తోచింది.. తమకు నచ్చింది చేయాలన్న పట్టుదలతో ఉంటారు.

అలాంటి మైండ్ సెట్ తోనే శనివారం ఒకే దేశం.. ఒకే భాష పేరుతో వివాదాల తేనెతుట్టెను కదిపిన అమిత్ షా మాటల పుణ్యమా అని ఈ రోజు దేశ వ్యాప్తంగా.. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి భాషను వారు అధిక ప్రాధాన్యత ఇవ్వటం మామూలే. అందుకు భిన్నంగా హిందీని రుద్దాలన్న భావనతో అమిత్ షా చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ అంశంపై తాజాగా విలక్షణ నటుడు.. కమ్ సామాజిక అంశాలపై తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా వెల్లడించే ప్రకాశ్ రాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గళం విప్పిన ఆయన.. నా తల్లి కన్నడ.. నా దేశం భారతదేశం.. అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. తాను కన్నడిగనని.. భారతీయుడ్ని అని.. హిందీ అమలు చేయటాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

మిస్టర్.. హోం బ్రేకర్.. జాతీయవాదం పేరుతో ఒకే మతం.. ఒకే భాష తెరపైకి తెచ్చారు. తర్వాత ఏంటి? అని క్వశ్చన్ చేశారు. అమిత్ షా ప్రకటన మీద కమల్ హాసన్ తో పాటు.. డీఎంకే అధినేత స్టాలిన్ సైతం మండిపడ్డారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి.. తన వ్యాఖ్యలపై ఆగ్రహంతో మండిపడుతున్న వారికి షా ఎలాంటి బదులిస్తారో చూడాలి.