Begin typing your search above and press return to search.

'ఆయుష్మాన్‌ భారత్' ను ప్ర‌క‌టించిన మోదీ!

By:  Tupaki Desk   |   15 Aug 2018 7:34 AM GMT
ఆయుష్మాన్‌ భారత్ ను ప్ర‌క‌టించిన మోదీ!
X
ఏ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మోదీ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో `నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్`(ఆయుష్మాన్ భార‌త్)కు పెద్ద‌పీట వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స్కీమ్ ద్వారా ద్వారా 10కోట్ల కుటుంబాలకు - సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుంది. దాని వ‌ల్ల ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్‌ మెంట్ ద‌క్క‌నుంది. పీపీపీ ప‌ద్ధ‌తిలో ఇన్సూరెన్స్ కంపెనీలు - ఐటీ కంపెనీల‌ను కూడా కేంద్రం.....`ఆయుష్మాన్ భార‌త్`లో భాగ‌స్వాముల‌ను చేసింది. ముందుగా అనుకున్న విధంగానే ఆగ‌స్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత వైద్యసాయం అందించే `ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని` మోదీ లాంచ్ చేశారు. సెప్టెంబర్‌ 25న దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి రోజు ఈ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు.

కుటుంబంలో ఒక‌రు జ‌బ్బు ప‌డితే ....మిగ‌తా స‌భ్యులు మాన‌సికంగా కుంగిపోతార‌ని - అటువంటి కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అన్నారు. ఈ ప‌థ‌కం కోసం.....అత్యాధునిక సాంకేతికతను ఉప‌యోగించ‌నున్నామ‌ని.... స‌రిపడా వైద్య సిబ్బంది - మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని మోదీ అన్నారు. ఆరోగ్య భారత్ త‌మ లక్ష్యమ‌ని మోదీ చెప్పారు. తొలి విడతలో ఈ ప‌థ‌కం ద్వారా 10కోట్ల మందికి వర్తింప‌జేసేలా చర్యలు చేప‌ట్ట‌నున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వ‌ర‌కు ఆరోగ్య బీమా ల‌భిస్తుంది. 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని అంచ‌నా. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాల్లో ఇదే అతి పెద్దది కావ‌డం విశేషం. సామాజిక - ఆర్థిక - కుల గణాంకాల వివ‌రాల‌ ఆధారంగా ఈ ప‌థ‌కానికి లబ్ధిదారుల గుర్తింపు జ‌రుగుతుంది. 80 శాతం మంది గుర్తింపు పూర్తయిన ఈ ప‌థ‌కంలో 1354 చికిత్స ల‌ను అందించ‌నున్నారు. గుండె బైపాస్‌ - మోకీలు మార్పిడి వంటి శస్త్రచికిత్సలు (సీజీహెచ్ ఎస్‌) కన్నా 15-20 శాతం తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. రోగులకు సాయం అందించేందుకు ఆసుప‌త్రిలో ఒక ‘ఆయుష్మాన్‌ మిత్రస , వారి అర్హతలను పరిశీలించడానికి ఒక ‘హెల్ప్‌ డెస్క్‌`ను ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారులకు అందించిన క్యూఆర్‌ కోడ్ లున్న పత్రాలను స్కాన్‌ చేయడం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు, అర్హతలను పరిశీలిస్తారు.