Begin typing your search above and press return to search.

సుహాసిని..ఆర్నెళ్ల‌లోనే మీ నాన్న‌ను బాబు మోసం చేశాడు

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:33 AM GMT
సుహాసిని..ఆర్నెళ్ల‌లోనే మీ నాన్న‌ను బాబు మోసం చేశాడు
X
కూకట్‌ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌య సుహాసిని విష‌యంలో సినీన‌టుడు - ర‌చ‌యిత పోసాని కృష్ణముర‌ళి ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. హ‌రికృష్ణ కూతురు సుహాసినిది తొందరపాటు నిర్ణయమ‌ని పేర్కొన్న ఆయ‌న టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు మాయలో పడొద్దని హిత‌వు ప‌లికారు. సుహాసిని పోటీ నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌తో పోసాని మాట్లాడుతూ ``30 ఏళ్ల‌ అనుబంధంలో హరికృష్ణ త‌నకు ఎన్నో విషయాలు చెప్పారని వివ‌రించారు. మీ తండ్రి దివంగత హరికృష్ణను చంద్రబాబు ఎన్నిసార్లు మోసం చేశాడో మీ కుటుంబానికి తెలియదా? ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకత వస్తుందని తెలిసి హరికృష్ణను అడ్డం పెట్టుకొని మోసంచేశాడు? టీడీపీ అధ్యక్షుడిగా హరికృష్ణను చేస్తానని నమ్మించి మంత్రి పదవి ఇచ్చిన ఆర్నెళ్లలోపే రాజీనామా చేయించి అవమానపరిచాడు. చంద్రబాబు మోసాలతో హ‌రికృష్ణ‌ ఎంత కుమిలిపోయారో టీడీపీ కార్యకర్తలకు - ప్రజలకు తెలుసు. తండ్రిని అవమానపరిచిన అవకాశవాది ఆదేశిస్తే, కూటమి అభ్యర్థిగా కూకట్‌ పల్లి నుంచి ఎలా పోటీకి దిగుతున్నారు?`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అమాయకురాలైన సుహాసినిని చంద్ర‌బాబు రోడ్డు మీదికి తీసుకొచ్చారని పోసాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``ఆమె గెలిచినా - ఓడినా అవమానమే. చంద్రబాబు మాయలో పడి కమ్మ సెంటిమెంట్ తీసుకొస్తే - తెలంగాణ వాళ్లు స్థానిక సెంటిమెంట్ తీసుకొస్తే ఇక్కడ ఆంధ్రావాళ్లు సంతోషంగా బతుకగలరా? నిజాయితీగా ఓటెయ్యాలి - కమ్మ కోణంలో ఓటు వేయవద్దు. ఇక్కడి ఆంధ్రావాళ్లంతా అన్నదమ్ముల్లా కలిసిపోయారు. కూకట్‌ పల్లిలో ఎక్కువగా కమ్మవాళ్లు ఉన్నారనే సుహాసినిని చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారే తప్ప - ప్రజలకు సేవ చేద్దామని కాదు. ఓటు వేసేటప్పుడు కులాన్నిబట్టి కాదు గుణాన్నిబట్టి వేయాలి. సుహసిని ఎంత మందికి తెలుసు. ఎన్ని సామాజిక సేవకార్యక్రమాల్లో పాల్గొన్నారు?``అని పోసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లోని కమ్మవాళ్లంతా కేసీఆర్‌ వైపే ఉన్నారని ఆయ‌న చెప్పారు.

హరికృష్ణ కుటుంబసభ్యులు జీవితకాలం కేసీఆర్‌ కు రుణపడి ఉండాలని పోసాని కృష్ణ‌ముర‌ళి సూచించారు. ``తెలంగాణ బిడ్డ కానప్పటికీ - హరికృష్ణ చనిపోతే ఎన్టీఆర్‌ పై ఉన్న గౌరవంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించారు. ఆది కేసీఆర్ గొప్పతనం. ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా సుహాసిని నిలబడటం సరికాదు. ``చంద్రబాబు ఒంటరిగా సైకిల్‌ గుర్తుతో ఎప్పు డూ ఎన్నికల్లో నిలబడలేదు. ఆయన గెలువాలంటే పొత్తు కావాలి. ఎప్పుడూ పక్క పార్టీల మీద ఆధారపడతాడు? వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశాడు. చంద్రబాబు అవకాశవాది. అవసరం ఉన్నప్పుడు శాలువా కప్పడం, చివరకు తిట్టి బయటకు పంపించడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు`` అని పోసాని ధ్వజమెత్తారు.