Begin typing your search above and press return to search.

ట్రాఫిక్‌ ఐలాండ్‌ బిగ్‌ స్క్రీన్‌ పై బ్లూఫిలిం వేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:19 AM GMT
ట్రాఫిక్‌ ఐలాండ్‌ బిగ్‌ స్క్రీన్‌ పై బ్లూఫిలిం వేశారు
X
రోడ్డు మీద వెళుతూ ఉంటే.. ట్రాఫిక్‌ ఐలాండ్‌ పక్కనే ఉండే పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ మీద బ్లూఫిలిం ప్రదర్శన నడుస్తోంటే మీరు ఏం చేస్తారు? ముందైతే నివ్వెరపోతారు!! ఆవెంటనే అనుకోకుండా చాన్సు వచ్చిందని.. కాసేపు బ్లూఫిలింను ఎంజాయ్‌ చేస్తారు. ఇంతలో.. అది రహస్యంగా చేసే పని అనే అభిప్రాయం మీకుంటుంది గనుక.. మరీ రోడ్డు మీద బ్లూఫిలిం చూస్తోంటే - ఎవరైనా మిమ్మల్ని చూస్తారేమో అని భయపడి.. సంకోచిస్తారు.. సాధారణంగా జరిగేది అదే కదా..

ఈ వ్యవహారమే పుణె నగరంలో చోటు చేసుకుంది. బ్లూఫిలిం అంటే అది కుర్రకారు రహస్యంగా తమ కంప్యూటర్లలోను, లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసనభ - పార్లమెంటుల్లోనూ ఉన్నప్పుడు మాత్రమే చూసే వ్యవహారం అనే అభిప్రాయం మనకు ఎవరికైనా ఉంటే దాన్ని కాస్త మార్చుకోవాలి. నట్టనడిరోడ్డులో ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గరుండే అతిపెద్ద స్క్రీన్‌ మీద కూడా బ్లూపిలిం చూడొచ్చు. పుణె నగరంలో అదే జరిగింది.

అక్కడ పట్టపగలు మాంచి ట్రాఫిక్‌ టైంలో ప్రకటనలో కోసం పెట్టిన ఒక స్క్రీన్‌ మీద బూతు బొమ్మలు వచ్చేశాయి. దీన్ని గమనించిన జనం నివ్వెరపోయారు. సమీపంలోని దుకాణదారులు షాక్‌ తిన్నారు. కాసేపట్లో అంతా సర్దుకుంది. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి తప్పును కవర్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. టెక్నికల్‌ టీం పనిచేస్తున్న సమయంలో.. అనుకోకుండా ఓ వెబ్‌ సైట్‌ తెరుచుకుందని, అది ఎవ్వరూ చేసినది కాదని.. సాకులు చెబుతున్నారట. అయినా మంచి ట్రాఫిక్‌ టైం లో జనానికి ఇలా బూతు షాక్‌ లు తగిలాయంటే.. దెబ్బకు రోడ్డుమీద యాక్సిడెంట్లు కూడా అయిపోవచ్చు. ఏమంటారు?