Begin typing your search above and press return to search.

క్యాన్స‌ర్‌ విద్యార్థి..స‌హాయం కోసం ఎదురుచూపు

By:  Tupaki Desk   |   12 Dec 2017 3:30 PM GMT
క్యాన్స‌ర్‌ విద్యార్థి..స‌హాయం కోసం ఎదురుచూపు
X
ర‌క్త క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతున్న ఓ పేద విద్యార్థి మ‌న‌లాంటి మ‌న‌సున్న వారి చిరు స‌హాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆ బాధితుడిని కాపాడుకునేందుకు ఆయ‌న త‌ల్లి క‌న్నీళ్లు పెట్టుకుంటోంది. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా బెస్త‌వారిపేట మండలం మోక్ష‌గుండ గ్రామానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ విద్యార్థి ఆర్ మ‌హేశ్వ‌ర్ రెడ్డిది ఈ అవ‌స్థ‌.

మ‌మేశ్వ‌ర్ రెడ్డికి ఇటీవ‌ల‌ నిమ్స్ ఆస్ప‌త్రిలో రోగ నిర్దార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా...ప్రాణాంత‌క‌మైన క్యాన్స‌ర్ వ్యాధి సోకింద‌ని తేల్చారు. ఆయ‌న కోలుకోవాలంటే క‌నీసం 10 ల‌క్ష‌ల రూపాయలు కావాలని తెలిపారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో ఉన్న మ‌హేశ్వ‌ర్ రెడ్డి వితంతువు అయిన ఆదిల‌క్ష్మ‌మ్మ మూడో త‌న‌యుడు. ఆదిల‌క్ష్మ‌మ్మ‌ త‌న కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి గ‌త ప‌దిహేనేళ్లుగా ప‌గలు..రాత్రి అన‌క శ్ర‌మిస్తోంది. ఆర్థికంగా ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికీ త‌న కుమారుల‌ను ఆమె ఉన్న‌త చ‌దువులు చ‌దివించారు. అలాంటి బిడ్డ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రికే ప‌రిమితం అవ‌డంతో భ‌విష్య‌త్ కోసం పెద్ద మ‌న‌సుతో దాత‌లు స‌హ‌క‌రించాల‌ని ఆమె వేడుకుంటున్నారు.

మ‌హేశ్వ‌ర్ రెడ్డికి ఎలాంటి మెడిక‌ల్ ఇన్సురెన్స్ లేదు. ప్ర‌స్తుత చికిత్స‌ను ఆ పేద కుటుంబం భ‌రించ‌డం చాలా క‌ష్టం. అందుకే ఆయ‌న ఆవేద‌న‌ను మంచి మ‌న‌సున్న వారికి చేర‌వేయ‌డం మా బాధ్య‌త‌గా భావిస్తున్నాం. అందుకే మీ స‌హాయాన్ని అర్థిస్తున్నాం. మీ స‌హాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. రండి..ఆ కుటుంబాన్ని ఆదుకుందాం.

For Donation & More Info Click here : https://www.gofundme.com/poor-youth-with-blood-cancer-seeks