Begin typing your search above and press return to search.

మందుకొట్టి మాల్ లో టీవీ నటి విశ్వరూపం

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:05 AM GMT
మందుకొట్టి మాల్ లో టీవీ నటి విశ్వరూపం
X
పూజా మిశ్రా.. బిగ్ బాస్ షో చూసిన వాళ్లకు బాగానే గుర్తుంటుంది ఈ పేరు. ఈ ఓ మోడల్ - టీవీ నటి కూడా. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ నెత్తినేసుకుని తిరగడం ఈమెకు మహా సరదా. గతంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సిబ్బందిపై దాడి చేస్తూ సీసీ టీవీ కెమెరాకు చిక్కి అక్షింతలు వేయించుకుంది. అప్పుడు పోయిన పరువు చాలదన్నట్లు తాజాగా ఇంకో పెద్ద సీన్ క్రియేట్ చేసింది పూజా మిశ్రా.

న్యూఢిల్లీలోని ఓ షాపింగ్ స్టోర్లో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫుల్లుగా మందు కట్టి స్టోర్లోకి అడుగుపెట్టిన పూజా.. అక్కడో కస్టమర్ తో గొడవ పడింది. ఆమెను వారించడానికి సిబ్బంది ప్రయత్నిస్తే వాళ్ల మీద చేయి చేసుకోవడమే కాక.. బూతులు తిట్టింది. సిబ్బంది ఓపిగ్గా మాట్లాడుతున్నా అమ్మడు ఆగలేదు. ఈ మొత్తం వ్యవహారమంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డవడంతో పూజ అడ్డంగా బుక్కయింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యవహారం పోలీస్ స్టేషన్ కు కూడా చేరింది. దిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. పూజాకు సంబంధించి గత నెల కూడా ఓ వీడియో బయటకు వచ్చింది. ఆమె బస చేసే ఫైవ్ స్టార్ హోటల్లో సిబ్బందిపై దాడికి దిగుతుండగా అదంతా సీసీ టీవీలో రికార్డయింది. కొన్ని నెలలుగా బిల్లులు కట్టకపోవడంపై అడగడమే సిబ్బందిపై ఆమె చేయిచేసుకోవడానికి కారణం. మహిళ కదా అని పోలీసులు లైట్ తీసుకుంటుంటే.. పూజా ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. పోలీసులు ఇప్పటికైనా ఏదో ఒకటి చేయకుంటే కష్టం.