పీసీసీ అధ్యక్షుడికే దిక్కులేదు..ఇదే కాంగ్రెస్ మార్క్ నైజం

Fri Nov 09 2018 21:43:34 GMT+0530 (IST)

మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య మీడియాతో నేరుగా మాట్లాడకుండా తన అభిప్రాయాన్ని ప్రకటన రూపంలో వెలువరించారు. బీసీలు అభద్రతతో ఉన్నారని - ఇలాంటి నిర్ణయాలు వాటిని మరింతగా పెంచుతాయని వ్యాఖ్యానించారు.గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వయసు పైబడిన వారి జాబితాను టీపీసీసీ నుంచి రాహుల్ గాంధీ ఇటీవల తీసుకున్నారు. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్ నేత కోదండరాంకు ఇవ్వనున్టన్లు ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ లో కలకలం నెలకొంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికే టికెట్ గల్లంతు అయిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. జనగామ విషయంలో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా పార్టీకి మంచిది కాదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. నా సీటు కోసమో - నా రాజకీయం కోసమో తాను మాట్లాడడం లేదన్నారు. ``రాష్ట్రంలో ఇప్పటికే బీసీలు రాజకీయంగా అభద్రతతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ బీసీ నాయకుడి సీటును రెడ్డి వర్గానికి కేటాయిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇది పార్టీ కి చాలా నష్టం చేస్తుంది. ఇలాంటి నిర్ణయాలు ఇంత అనాలోచితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు`` అని పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు కాంగ్రెస్ చర్చించిన తుది జాబితాలో పేరు లేని ఆపార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్య టిక్కెట్ కు లైన్ క్లియర్ చేశామని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి వెల్లడించారు. ఇదే సహయంలో మారో హాట్  టాపిక్ తెరమీదకు వచ్చింది. జనగామ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆయనతో చర్చించినట్లు సమాచారం. రాబోయే ప్రభుత్వం తమదేనని - మంత్రి వర్గంలో ఆర్థికశాఖను కూడా కేటాయిస్తామని హరీష్ రావు పొన్నాలకు ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ చీఫ్ కేసీఆర్ తో తనకు మాట ఇప్పించాలని అప్పుడే తాను నమ్ముతానని పొన్నాల హరీష్ కు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.