Begin typing your search above and press return to search.

స్వరం మారుతున్నది.. కాంగ్రెస్ గళం మారుతున్నది

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:48 PM GMT
స్వరం మారుతున్నది.. కాంగ్రెస్ గళం మారుతున్నది
X
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వెలవడ్డాయి. గెలుపోటాములు విశ్లేషించుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా తీవ్ర అవమాన భారంతో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తోంది. పనిలో పనిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ గళాన్ని పెంచుతున్నారు. ఇది తెలంగాణ ఎన్నికలలో టిక్కెట్లు రాని నాయకులు వారి అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకోలేని నాయకులు తమ గళాన్ని విప్పుతున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ప్రజాకూటమి పొత్తులో భాగంగా 90 స్దానాలకు పైగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్దానాలలోనే విజయం సాధించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని అవమానంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలపై పార్టీ పరంగానే కాక వ్యక్తిగత విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఈ నివేదికలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి - సోనీయా గాంధీకి వ్యక్తిగతంగా అందచేస్తున్నారు. ఈ పనిని ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి సుధాకర రెడ్డి ఈసరికే ప్రారంభించారు.

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీతో పొత్తే కారణమని పొంగులేటి తీవ్ర స్వరంతో చెబుతున్నారు. ఈ ఎన్నికలలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా ఉండిఉంటే మరన్నీ స్దానాలు గెలిచి ఉండే వారమని పొంగులేటి తన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు తెలుగుదేశంతో పొత్తులు కుదుర్చుకోవడంతో స్దానిక నాయుకుల అత్యుత్సాహం చూపించారని తెలంగాణలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను మరుగున పరచారని పొంగులేటి నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తు నివేదికలను తయారు చేసారు. వీటిని విడివిడిగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, సోనీయా గాంధీకి ఇస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపై వివిధ విశ్లేషణలు చేస్తూ తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు కాంగ్రెస్ నాయకలు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడి ఓటమిని ఏకపక్షం చేసేందుకు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపైనా, మరికొందరి నాయకలపైన నిందలు వేసేందుకు తమ నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో ఈ నిరసనల హోరు ముందు ముందు మరింత పెరుగుతుందంటున్నారు.