జిల్లాల్లో మిషన్లు ఓకేనా?

Thu Dec 06 2018 20:27:28 GMT+0530 (IST)

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల దగ్గర్నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఈసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వీవీప్యాట్లు కూడా చేరవేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 520 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నిర్మల్ జిల్లాలో 757 - మంచిర్యాల జిల్లాలో 698 - ఆసిఫాబాద్ జిల్లాలో 532 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేయబోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కు అధికారులు అంతా సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లాలో 1151 పోలింగ్ బూత్ లు - రాజన్న సిరిసిల్ల జిల్లాలో 505 - పెద్దపల్లి జిల్లాలో 804 - జగిత్యాల జిల్లాలో 776 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది సామగ్రితోపాటు చేరుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 1433 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలో 740 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికొస్తే.. వరంగల్ అర్బన్ జిల్లాలో 690 - వరంగల్ రూరల్ జిల్లాలో 504 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 491 - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 572 - ఖమ్మం జిల్లాలో 1305 - కొత్తగూడెం జిల్లాలో 998 పోలింగ్ బూత్లు రెడీ అయ్యాయి. నియోజకవర్గాల వారీగా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. నల్లగొండ జిల్లాలో 1629 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 1093 - యాదాద్రి భువనగిరి జిల్లాలో 552 - జనగాం జిల్లాలో 828 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 1479 - మెదక్ జిల్లాలో 538 - సిద్దిపేట జిల్లాలో 1102 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పాలమూరు జిల్లా పోలింగ్ కు రెడీ అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో 1312 - నాగర్ కర్నూల్ జిల్లాలో 775 - వనపర్తి జిల్లాలో 280 - జోగులాంబ గద్వాల జిల్లాలో 508 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 3092 - వికారాబాద్ జిల్లాలో 1096 - మేడ్చల్ జిల్లాలో 2182 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 వేల 815 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించబోతున్నారు.

అన్ని జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రతీ ఓటరు నిర్భయంగా - స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.