Begin typing your search above and press return to search.

వామ్మో.. అక్కడెన్ని పార్టీల్రా బాబోయ్

By:  Tupaki Desk   |   4 May 2016 6:42 AM GMT
వామ్మో.. అక్కడెన్ని పార్టీల్రా బాబోయ్
X
దేశంలో రాజకీయ పార్టీలకు కొదవలేదు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో పార్టీల జోరు ఓ రేంజ్లో ఉంటుంది. ఏపీ.. తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలానే ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసేవి వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉంటాయి. అయితే.. తమిళనాడులో ఇందుకు భిన్నమైన పరిస్థితి. చిన్నచిన్నపార్టీలు బోలెడన్ని ఉంటాయి. వీటి అధినేతలు కూడా ఎంతోకొంత ప్రభావితం చేసే వారే కావటం ఇక్కడ గమనించాల్సిన అంశం.

అయితే.. ఇలా పేరున్న నాయకుల్లో కొందరు మాత్రం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే.. మరికొందరు పార్టీ అధినేతలు మాత్రం పోటీకి దూరంగా ఉండటం ఆసక్తి కలిగించే అంశంగా చెప్పొచ్చు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీ మొత్తం అధికార అన్నాడీఎంకే.. విపక్ష డీఎంకే కూటమి మధ్యనే ఉంటుంది. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా గెలుపు విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో తమదే విజయం అంటూ డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ చెబుతుంటారు. ఆయన నేతృత్వంలోని కొన్ని పార్టీల కూటమి తమిళనాడు ఎన్నికల్లో తన సత్తా చాటుతుందన్నది విజయ్ కాంత్ నమ్మకం.

ఇదిలా ఉంటే.. తెలుగు ప్రజలకు ఏ మాత్రం పరిచయం లేని విధంగా.. తమిళనాడులోని పార్టీలు బోలెడన్ని ఉంటాయి. వివిధపార్టీల అధినేత బరిలోకి దిగేందుకు ఎంత ఆసక్తి ప్రదర్శిస్తుంటారో.. అదే సమయంలో మరికొన్ని పార్టీల అధినేతలు ఎన్నికల బరిలోకి దిగేందుకు ససేమిరా అనే వైఖరి కనిపిస్తుంది. ఎన్నికల బరిలోకి దిగే పార్టీలు.. వాటి అధినేతలు.. అదే సమయంలో ఎన్నికల బరిలోకి దిగని పార్టీలు.. వాటి అధినేతల్ని చూస్తే..

ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీ అధినేతలు.

= జయలలిత (అన్నాడీఎంకే)

= కరుణానిధి (డీఎంకే)

= విజయ్ కాంత్ (డీఎండీకే)

= నటుడు శరత్ కుమార్ (ఎస్ఎంకే – సమత్తువ మక్కల్ కట్చి - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= తమిళన్ అన్సారీ (ఎంజేకే – మణిదనేయ జననాయక కట్చి - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= తమిళరసన్ (ఆర్ పీఐ - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= తనియరసు (తమిళనాడు కొంగు ఇలంజర్ పేరవై - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= షేక్ దావూద్ (తమిళ మానిల ముస్లిం లీగ్ - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= సినీనటుడు కరుణాస్ (ముక్కులోత్తోర్ పులిప్పడై - అన్నాడీఎంకే మిత్రపక్షం)

= జవహిరుల్లా (ఎంఎంకే - డీఎంకే మిత్రపక్షం)

= డాక్టర్ కృష్ణస్వామి (పుదియ తమిళగం - డీఎంకే మిత్రపక్షం)

= చంద్రకుమార్ (మక్కల్ డీఎండీకే)

= తిరుమావళవన్ (డీపీఐ)

= డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ (బీజేపీ)

ఎన్నికల బరిలో దిగని పార్టీ అధినేతలు

= జీకే వాసన్ (టీఎంసీ)

= వైగో (ఎండీఎంకే)

= ఇళంగోవన్ (టీఎన్ పీసీసీ)

= డాక్టర్ రాందాస్ (పీఎంకే)

= వీరు కాక సీపీఎం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు కూడా పోటీకి దూరంగా ఉన్నారు.