Begin typing your search above and press return to search.

బీజేపీ టు వైసీపీ.. వైసీపీ టు టీడీపీకి..?!

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:54 AM GMT
బీజేపీ టు వైసీపీ.. వైసీపీ టు టీడీపీకి..?!
X
కర్నూలు జిల్లా వైసీపీలో శిల్పా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని పోరాడింది శిల్పా ఫ్యామిలీ. అన్న కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వైసీపీ కండువాను కప్పుకున్నారు శిల్పాచక్రపాణి. కానీ నంద్యాల ఉప పోరులో శిల్పా మోహన్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో శిల్పా ఫ్యామిలీ పోరుకు సిద్ధమంటోంది. మోహన్‌ రెడ్డి కుమారుడు శిల్పా రవి నంద్యాల అసెంబ్లీ ఇన్‌ చార్జిగా ఉన్నారు. శిల్పా చక్రపాణి శ్రీశైలం ఇన్‌ చార్జిగా కొనసాగుతున్నారు.

ఈ తరుణంలో శిల్పా మోహన్‌ రెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు బిజ్జం పార్థసారధిరెడ్డి కూడా వైసీపీ ఎంపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరు ఈ స్థానం కోసం పోటీపడుతుండగా పార్టీ అధినేత మాత్రం మరో కీలక నేత వైపు చూస్తున్నాడట. వీరిద్దరిని కాదని కర్నూలు జిల్లా బీజేపీ నేత పోచా బ్రహ్మానందరెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే బ్రహ్మానందరెడ్డి వైసీపీలోకి చేరుతున్నట్లు జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సీడ్స్‌ బిజినెస్‌ రంగంలో రాణిస్తున్న బ్రహ్మానందరెడ్డి బీజేపీలో ఉండగా ఆయన బంధువర్గం టీడీపీలో కొనసాగుతోంది. ఫైనాన్సియల్‌ గా ఫిట్‌ గా ఉన్న బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై శిల్పా మోహన్‌ రెడ్డి ఎలా స్పందిస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. తన తమ్ముడికి - కుమారుడికి అసెంబ్లీ టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో ఆయన సర్దుకుపోతారా..? లేక భగ్గుమంటారా..? అన్న చర్చ నడుస్తోంది. అయితే శిల్పా ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలో దిగుతున్న సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దించుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

ఒకే పార్టీ నుంచి ఇద్దరి బంధువులకు టిక్కెట్లు ఇస్తున్న సమయంలో మూడో టికెట్‌ పై ఎలాంటి అభ్యంతరం చెప్పరని అనుకుంటున్నారట. మరోవైపు శిల్పా అంగీకారంతోనే బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బిజ్జం పార్థసారధిరెడ్డి ఏం చేస్తారన్న చర్చ బయటకు వచ్చింది. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్‌ రాకపోతే సైకిల్‌ ఎక్కుతారని కూడా అంటున్నారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే అయిన బిజ్జం ఈసారి నంద్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగుతోంది. అయితే పార్టీ ఏదని త్వరలో నిర్ణయమవుతుందని అంటున్నారు. బ్రహ్మానందరెడ్డి బీజేపీ నుంచి వైసీపీలోకి వస్తే బిజ్జం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్‌ ఉన్నట్లేనంటున్నారు. ఇలా ఎన్నికల వేళ నేతల కప్పుదాట్లు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.