Begin typing your search above and press return to search.

ప్లేబాయ్ మొత్తంగా మారిపోతుందట

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:30 PM GMT
ప్లేబాయ్ మొత్తంగా మారిపోతుందట
X
ప్లేబాయ్ పేరు వింటే ఎవరికైనా సరే.. గుర్తుకొచ్చేది ఒక్కటే. సెల్రబిటీల నగ్న ఫోటోలతో కిక్ ఎక్కించే ఈ మ్యాగ్ జైన్ కు సంబంధించి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితమే.. ప్రముఖ నటీమణుల నగ్న చిత్రాల్ని ప్రచురించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. లక్షలాది కాపీలు అమ్ముడయ్యే ప్లేబాయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాలని భావించటం ఇప్పుడు మీడియా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

అప్పుడెప్పడో 1972లో మడోనా.. షరాన్ స్టోన్.. నవోమీ క్యాంప్బెల్ లాంటి హాలీవుడ్ అందాల భామల నగ్నచిత్రాల్ని ప్రచురిస్తే.. 70 లక్షల కాపీల్ని అమ్మేశారు. అలాంటి ప్లేబాయ్ అమ్మకాలు ఇప్పుడు దారుణంగా పడిపోయాయంట.

1975లో 56 లక్షలుగా ఉన్న పత్రిక సర్క్యులేషన్.. ఇప్పుడు కేవలం 8 లక్షలు మాత్రమే ఉందట. దీంతో.. ప్లేబాయ్ తన రూపురేఖల్నే కాదు.. తన కంటెంట్ ను పూర్తిగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇకపై ప్లేబాయ్ నగ్న చిత్రాల్ని ప్రచురించకూడదన్న నిర్ణయాన్ని తీసుకుందట.

ఇకపై పాఠకుల మనసులకు నచ్చే కటెంట్ మాత్రమే ఇవ్వాలని భావిస్తోందట. ఇందుకోసం ప్లేబాయ్ ని రీడిజైన్ చేయాలని డిసైడ్ చేశారట. విస్తరించిన ఇంటర్నెట్ పుణ్యమా అని నగ్న చిత్రాలు కుప్పలు కుప్పలుగా దొరికిపోతున్న సమయంలో.. ప్లేబాయ్ ని ప్రత్యేకంగా కొని చదవాల్సిన అవసరం లేకపోవటమే ప్లేబాయ్ అమ్మకాలు పడిపోవటానికి కారణంగా చెబుతున్నారు. మరి.. ప్లేబాయ్ అందించే సరికొత్త కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.