Begin typing your search above and press return to search.

అన్న‌లా చేస్తే పాతికేళ్లు త‌ల ఎత్తుకోలేం ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   21 March 2018 5:47 AM GMT
అన్న‌లా చేస్తే పాతికేళ్లు త‌ల ఎత్తుకోలేం ప‌వ‌న్‌!
X
ప‌వ‌న్ పై ఆశ‌లు తొల‌గిపోతున్నాయా? ఆయ‌న‌పై న‌మ్మ‌కం స‌డులుతోందా? నాలుగేళ్లుగా ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నోళ్లు సైత మైండ్ సెట్ మార్చుకుంటున్నారా? ఎప్పుడూ లేనన్ని సందేహాలు ప‌వ‌న్ తీరుపై వ్య‌క్త‌మ‌వుతున్నాయా? ఇంత‌కాలం ప‌వ‌న్ ను ప‌వ‌న్ లా చూసినోళ్లు కాస్తా.. ఇప్పుడు చిరు యాంగిల్ లో త‌మ్ముడ్ని చూస్తున్నారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది.

గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న మాట‌ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ బ్యాచ్ సైతం ఖండ‌న‌లు షురూ చేయ‌టం గ‌మ‌నార్హం. త‌మ నేత అన‌ని మాట‌ల్ని త‌ప్పుగా అనుకున్నారంటూ వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌టం పెరుగుతోంది.

ఏపీ హోదా విష‌యంపై ప‌వ‌న్ క్లారిటీ లేకుండా మాట్లాడుతూ లేనిపోని కొత్త క‌న్ఫ్యూజ‌న్లు క్రియేట్ చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. హోదా త‌ప్పించి ఇంకేమీ వ‌ద్ద‌న్న పెద్ద‌మ‌నిషి.. ఇప్పుడు హోదా కాదు.. నిధులు ముఖ్య‌మ‌న్న మాట‌ను చెప్ప‌టం వెనుక ప‌రమార్థం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఏపీ కాపునాడు అధ్య‌క్షుడు పిళ్లా వెంక‌టేశ్వ‌ర‌రావు చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ప‌వ‌న్ రూపంలో మ‌రో చిరంజీవి నాటి ప‌రిస్థితుల్ని తీసుకొస్తే..కాపు సామాజిక వ‌ర్గం స‌భ్య స‌మాజంలో మ‌రో పాతికేళ్ల వ‌ర‌కూ త‌లెత్తుకు నిల‌బ‌డ‌లేద‌న్నారు. అలాంటి దుస్థితిని ప‌వ‌న్ క‌ల్పించొద్ద‌ని ఆయ‌న కోరారు. ఏపీ హ‌క్కుల సాధ‌న కోసం పోరాటం చేస్తున్న చంద్ర‌బాబుకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. బాబు పోరాటాన్ని బ‌ల‌హీన ప‌రిచే ఏ చ‌ర్య అయినా స‌రే కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

బీజేపీ విధానాలు చూసినంత‌నే ఒళ్లు కంప‌రం పుడుతున్న వేళ‌.. బీజేపీ భావాలు ప‌వ‌న్ మాట‌ల్లో వినిపించ‌టంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బీజేపీ త‌ర‌ఫు వ‌క‌ల్తా పుచ్చుకొని కాపు సామాజిక వ‌ర్గానికి ద్రోహం త‌ల‌పెట్టొద్దంటూ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న‌కు కులం లేద‌ని ప‌వ‌న్ చెప్పినా.. ఆయ‌న్ను త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా ఫీల‌య్యే వారిని ప‌వ‌న్ ఏం చెప్ప‌గ‌ల‌రు. ప‌వ‌న్ చ‌ర్య‌లతో త‌మ సామాజిక వ‌ర్గం బ‌ద్నాం అవుతుంద‌న్న మాట‌కు ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.