Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఉత్సవ విగ్రహంతో ఉద్దండులు

By:  Tupaki Desk   |   24 May 2019 10:04 AM GMT
పిక్ టాక్: ఉత్సవ విగ్రహంతో ఉద్దండులు
X
బీజేపీ పుట్టుకకు కారుకులు ఎవరు.? బీజేపీని ఇంత ఎత్తుకు తీసుకువచ్చింది ఎవరు.? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అంటే ఏమీ లేదు.. ఉత్సవ విగ్రహంలా పడి ఉన్నారు. ఒకరు కదలలేని స్థితిలోంచి కనుమరుగైన వాజ్ పేయి కాగా.. మరొకరు కదిలే స్థితిలో ఉన్నా.. అష్టదిగ్బంధనంతో బందీ అయిపోయి ఉత్సవ విగ్రహం లా మారిన అద్వానీ మరోవైపు ఉన్నారు.

గత సంవత్సరం ఆగస్టు 16న కాలం చేసిన వాజ్ పేయి బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు, కురువృద్దుల్లో ఒకరు.. ఆయన తర్వాత పార్టీలో సీనియర్ అద్వానీయే.. ఈయన ఇంకా బతికే ఉన్నారు. కానీ బతికున్న జీవశ్చవంలా బీజేపీ మార్చేశారని పార్టీ అభిమానులు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి.

ప్రతిసారి గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసే అద్వానీకి ఈసారి మోడీషాలు టికెట్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో అద్వానీ స్థానంలో అమిత్ షా పోటీచేసి 5 లక్షల మెజార్టీతో తాజాగా గెలిచారు. సీనియర్లకు అవకాశాలు లేవంటూ దూరం పెట్టడంతో అద్వానీ లేఖలు, ట్విట్లర్ వాపోయారు.. ‘ఈ పరిగెత్తే కాలంలో ప్రతీది రాజకీయంగా మారిందని.. విలువలు, సిద్ధాంతాలు లేవంటూ ’ ఆవేదన చెందారు. మోడీ షాల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించకున్నా.. తనను బీజేపీకి దూరం పెట్టిన వారికి షాక్ తగిలేలాగానే అద్వానీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కురువృద్ధుడి విషయంలో మోడీషాలు వ్యవహరించిన తీరు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉందంటే అతిశయోక్తి కాదు..

ఈ ఎన్నికల వేళ మళ్లీ బీజేపీ గెలిచింది. కాదు కాదు.. మోడీషాలే గెలిపించారు. పట్టాపగ్గాలేని వీరి జోడి మళ్లీ అధికారంలోకి వస్తోంది. సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ లకు కనీసం టికెట్లు ఇవ్వని వీరు.. మళ్లీ గెలిచాక వారినే కలవడం విచిత్రం. మొదటగా అద్వానీ వద్దకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నామని.. బీజేపీ ఘనవిజయాన్ని వివరించామని మోడీషాలు చెప్పుకొచ్చారు.. అలానే మురళీ మనోహర్ జోషిని కలిసి ఆ ఫొటోలను తీసుకొని మోడీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. తమకు సీనియర్లపై గౌరవం ఉందంటూ వినయాలు ప్రదర్శిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. గౌరవం అంటే ఫొటోల్లో కాదు.. వారికి సరైన పదవులు, కేంద్రంలో అధికారంలోకి తీసుకున్నప్పుడే సముచిత గౌరవం అంటూ యాంటీ బీజేపీ వాదులు కామెంట్లు విసురుతున్నారు. బీజేపీలో సీనియర్లకు అవమానిస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు. ఎంత చేసినా.. ఎవరెన్ని అన్నా మోడీషాల ప్రస్తుత జోరు ముందు ఈ మాటలు నీటి మూటలేనని విమర్శలకులు అభిప్రాయపడుతున్నారు.