Begin typing your search above and press return to search.

అవును.. ఆ దర్శకుడు అత్యాచారం చేశాడు!

By:  Tupaki Desk   |   30 July 2016 3:29 PM GMT
అవును.. ఆ దర్శకుడు అత్యాచారం చేశాడు!
X
తన ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన ఒక అమెరికన్ మహిళపై అత్యాచారం చేసిన కేసులో బాలీవుడు దర్శక నిర్మాత మహమూద్ ఫారుఖీ ని కోర్టు దోషిగా తేల్చింది. సుమారు ఏడాదికాలంగా కొనసాగిన విచారణ అనంతరం తీర్పు వెల్లడించిన కోర్టు.. ఆ దర్శకుడే రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయని తెలిపింది.

కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన 34 ఏళ్ల మహిళ తన రీసెర్చ్ కోసం 2015లో ఇండియాకు వచ్చారు. తన పరిశోధనకు అవసరమైన కొన్ని చారిత్రక రిఫరెన్సుల కోసం ఆమె మహమూద్ ఫారూఖీ ని కలిశారు. అలా వీరిమధ్య పరిచయం ఏర్పడిన కొంతకాలం తర్వాత 2015 మార్చి 28న ఫారూఖీ ఢిల్లీ లోని తన ఇంట్లో జరిగిన పార్టీకి ఆమెను కూడా ఆహ్వానించాడు. అనంతరం ఆ మహిళను ఒక గదిలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన తర్వాత సంఘటన జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయిన బాధిత మహిళతో తన తప్పును క్షమించాలని ఫారూఖీ వేడుకున్నాడట.

ఈ క్రమంలో కొంతకాలం ఫారూఖీతో ఉత్తరప్రత్యుత్తరాలు నడిపిన ఆ మహిళ.. కొంతకాలం తర్వాత రాయబార కార్యాలయం సహకారంతో ఫారూఖీపై ఫిర్యాదు చేసింది. దీంతో 2015 జూన్ లో పోలీసులు ఆ దర్శకుడిని అరెస్టు చేశారు. నాటి నుంచి విచారణ సాగిన ఈ కేసుకు సంబందించి ఫారూఖీని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఆగస్టు 2న ఖరారు చేయనుంది! కాగా.. "పిప్లీ లైఫ్" సినిమాకి కో-డైరెక్టరుగా పనిచేసిన ఫారూఖీ.. ఆ సినిమా దర్శకురాలు అనూషా రిజీవికి భర్త!!