Begin typing your search above and press return to search.

మిసెస్ ర‌విప్ర‌కాష్‌..మీ పిల్ల‌ల‌కు టీవీ9 చూప‌కండి- ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   21 April 2018 1:51 PM GMT
మిసెస్ ర‌విప్ర‌కాష్‌..మీ పిల్ల‌ల‌కు టీవీ9 చూప‌కండి- ప‌వ‌న్‌
X
ఇచ్చిన మాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిల‌బెట్టుకున్నాడు. ర‌వి ప్ర‌కాష్ కోసం ప్ర‌త్యేకంగా మ‌రో ట్వీట్ వేశారు. 40 గంట‌లుగా నిర్విరామంగా ట్వీట్స్ పెడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంకా వాటిని ఆప‌లేదు. కొంత‌సేప‌టి క్రితం శ్రీ‌నిరాజుకు, రాధాకృష్ణ‌కు వేర్వేరు ట్వీట్లు వేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైం తీసుకుని ర‌వి ప్ర‌కాష్ కోసం ప్ర‌త్యేకంగా ట్వీట్ పెడ‌తాను అని చెప్పారు. చెప్పిన‌ట్లే ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ తో పాటు ఒక ఫొటో కూడా పెట్టారు. భార్య‌తో పాటు ఉన్న ర‌వి ప్ర‌కాష్‌ ఫొటో వెత‌క‌డానికే కాసేపు టైం తీసుకున్నారేమో.

అయితే, ర‌విప్ర‌కాష్ కోసం రాసిన ఈ ట్వీట్‌ లో ర‌విప్ర‌కాష్‌ ను కాకుండా ర‌వి శ్రీ‌మ‌తిని అడ్ర‌స్ చేసి ట్వీట్ చేశారు ప‌వ‌న్‌. *మిసెస్ ర‌వి ప్ర‌కాష్ గారికి న‌మ‌స్కారాలు - మీ ఆయ‌న మంచోడు అమ్మా. అయ‌తే, మీకో విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నా. మీ పిల్ల‌ల‌ను మాత్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని టీవీ9 ప్రోగ్రాంల‌ను చూడ‌కుండా దూరంగా ఉంచండి. ఎందుకు అని మీకు అనుమానం వ‌స్తుందేమో. దానిని క్లియ‌ర్ చేయండానికి వీడియో పెడ‌తాను - చూడండి* అంటూ ప‌వ‌న్ ను శ్రీ‌రెడ్డి తిట్టిన వీడియో మ‌ళ్లీ పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ల‌న్నీ చూస్తుంటే మీడియాపై త‌న యుద్ధాన్ని చాలా సీరియ‌స్‌ గా ప‌వ‌న్ తీసుకున్న‌ట్లు అనిపిస్తుంది. మ‌రి దీనికి ర‌విప్ర‌కాష్ నుంచి స్పంద‌న ఇంకా రాలేదు. అంత‌కుమునుపు రాధాకృష్ణ‌పై చేసిన ట్వీట్స్ కు కూడా ఇంకా రాధాకృష్ణ స్పందించ‌లేదు.