Begin typing your search above and press return to search.

బాబు స్టాండ్ ఇది..ఇవిగో ఆధారాలు- ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   22 July 2018 10:28 AM GMT
బాబు స్టాండ్ ఇది..ఇవిగో ఆధారాలు- ప‌వ‌న్‌
X
హోదా విషయంలో ఏపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత అన్యాయం చేసిందో... రాష్ట్రంలో టీడీపీ కూడా అంతే అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలని తీవ్రంగా దెబ్బ తీసింది. గ‌తంలో బాబు ప్ర‌త్యేక హోదాను ఎంత తీవ్రంగా వ్య‌తిరేకించారో ఆయ‌న అభిమాన మీడియాలోనే ప్ర‌ముఖంగా ప్ర‌చురిత‌మైంది. చాలా సార్లు... వాటిని గుర్తు చేస్తూ వైసీపీ ఆధారాలు చూపింది. బాబు రాజకీయ అవ‌స‌రాల మేర‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడ‌తార‌ని జ‌గ‌న్ దుమ్ముదులిపేశారు. అయితే, తాజాగా ఎంతో కాలంగా వైసీపీ చూపిస్తున్న ఆధారాల‌ను జ‌న‌సేన త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. బాబు హోదాను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు - హోదా వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని వ్యాఖ్య‌ల‌కు ఇంత ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలు ఉన్న‌పుడు చంద్ర‌బాబు హోదా పోరాటాన్ని ఎలా న‌మ్ముతాం అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

విభజన హామీలపై తెలుగుదేశం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంద‌ని - వారి రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మాటలు మారుస్తు యు ట‌ర్న్ తీసుకుంటూనే చంద్రబాబు జీవితం గ‌డిపేశారని ప‌వ‌న్ విమ‌ర్శించారు. ప్రత్యేక హోదా సాధన - విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సిందేనని - బాబు పోరాటం వల్ల ఉప‌యోగం లేద‌న్నారు.

టీడీపీ ఎంపీలు బీజేపీని తిడుతూనే... ఇంకో వైపు బీజేపీ కాళ్ళు మొక్కుతారని ఈ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ ని ఎలా అర్థం చేసుకోవాల‌ని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నిండు సభలో చంద్రబాబు తమ మిత్రుడేనని ప్రకటించారని -ఇంత‌కంటే... చంద్రబాబుది డ్రామా అని నిరూపించ‌డానికి ఇంకేం కావాల‌న్నారు.

హోదాపై టీడీపీ వాదం ఇదీ అంటూ.. బాబు హోదాను వ్య‌తిరేకించిన వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క్లిప్పింగుల‌ను ప‌వ‌న్ ట్వీట్ చేశారు. హోదాతో ఏం వస్తుందని - హోదాతో ఒరిగేదేం లేదని - హోదా అంటే జైలుకేనని - హోదాతో పరిశ్రమలు రావని - హోదా వేస్ట్ అని చంద్రబాబు నాడు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వాటిని పోస్ట్ చేశారు. అయితే, వీట‌న్నింటిని వైసీపీ ఎపుడో విడుద‌ల చేసింది. వాటిని ప‌వ‌న్ మ‌రోసారి జ‌నాల‌కు చూపించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. చంద్రబాబు హోదా అడగనేలేదు అని ఆనాడు బీజేపీ నేత సిద్ధార్థ నాథ్ సింగ్ అన్న పత్రిక కట్టింగ్‌ ను కూడా పోస్ట్ చేశారు.