భీమవరం నుంచి పవన్ తప్పుకుంటున్నాడా.?

Mon Mar 25 2019 23:35:03 GMT+0530 (IST)

భీమవరం నుంచి పవన్ కల్యాణ్ తప్పుకుంటున్నాడా.? ఒకవేళ ఇదే నిజం అయితే అభిమానులు అల్లాడిపోవడం ఖాయం. ఎందుకంటే.. పవన్ భీమవరంలో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఆయన అభిమానుల ర్యాలీ చేశారు. కెమేరాలో షూట్ చేస్తే ఆ బైక్ ర్యాలీ షూట్ చేయడానికి పట్టిన టైమ్ 5 నిమిషాలు. ఇవన్నీ పక్కపెడితే.. ఇప్పుడు భీమవరం నుంచి పవన్ తప్పుకోవాలి అనుకుంటున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.పవన్ కల్యాణ్ గాజువాక - భీమవరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. నామినేషన్ గడువు పూర్తైంది. ఉపసంహరణకు చివరి తేది మార్చి 28. ఈలోపుగా ఎవ్వరైనా నామినేషన్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ గాజువాక - భీమవరం నియోజకవర్గాల్లో గెలిచినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి పవన్ రాజీమామా చెయ్యాలి. దీంతో.. ముందుగానే తప్పుకుంటే మంచిదని అనుకుంటున్నారని సమాచారం. భీమవరం నుంచి నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎలా ఉంటుంది తద్వారా ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి అని కోర్ టీమ్ తీవ్రంగా చర్చిస్తోందట. రెండు రోజల్లోనే దీనిపై స్పష్టత వస్తుందని.. ఆ తర్వాత పవన్ నిర్ణయం ఉంటుంది సమాచారం. మరి పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో మరో రెండు రోజులు ఆగితే కానీ తెలియదు.