Begin typing your search above and press return to search.

అమిత్ షా బ‌రి తెగించినా... ప‌వ‌న్ సైలెన్స్‌

By:  Tupaki Desk   |   30 May 2017 4:37 AM GMT
అమిత్ షా బ‌రి తెగించినా... ప‌వ‌న్ సైలెన్స్‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెల‌రేగిపోవ‌టం తెలిసిందే. ఇక‌.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. విభ‌జ‌న నేప‌థ్యంలో హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా మీద ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హోదా అవ‌స‌రం లేద‌ని.. అస‌లు హోదా అంశాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన‌లేదంటూ దారుణ వ్యాఖ్య‌లు చేశారు. హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చామంటూ గొప్ప‌లు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. హోదా విష‌యంపై మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అవుతార‌న్న భావ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్ట‌కున్నా..క‌నీసం ట్వీట్ల రూపంలో అయినా ఆయ‌న స్పందిస్తార‌నుకున్నారు.

ఆస‌క్తిక‌రంగా ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌న లేకుండా ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయాల గురించి.. గ‌డిచిన కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి కామ్ గా ఉంటున్న ప‌వ‌న్‌.. త‌న త‌దుప‌రి చిత్రం షూటింగ్ ల‌లో బిజీబిజీగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఎంత సినిమా షూటింగ్ ల‌లో బిజీగా ఉన్నా... కీల‌క‌మైన హోదా విష‌యంలో.. అందునా తాను ప్ర‌త్యేకంగా టేక‌ప్ చేసిన అంశం మీద అమిత్ షా అంతగా స్పందించిన వేళ‌.. ప‌వ‌న్ ఎందుకు కామ్ గా ఉన్న‌ట్లు? అంటే.. హోదా ఇష్యూను ప‌వ‌న్ సైతం వ‌దిలేశారా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/