ప్రముఖ సింగర్ తో ప్లీనరీకి పవన్ స్పెషల్ సాంగ్

Tue Mar 13 2018 20:00:06 GMT+0530 (IST)

జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్లీనరీకి ఊపు తీసుకువస్తున్నారు. ఓ వైపు పార్టీ ప్లీనరీకి సిద్ధమవుతూనే మరోవైపు ఇతరత్రా అంశాలపై శ్రద్ధ పెడుతునన్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల - కాటమరాయుడు సినిమాలకు ఆకట్టుకునే సంగీతం అందించిన యువ మ్యూజిక్ కంపోజర్ అనూప్ రుబెన్స్ మరోమారు పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. అయితే ఈ దఫా ఆయన సినిమాలకు కాకుండా పవన్ రాజకీయ కార్యకలాపాలకు తన సేవలు అందించారు. జనసేన ప్లీనరీకి సిద్ధమవుతున్న సమయంలో ఇంకెన్ని గాయాలు పేరుతో ఆ పార్టీ రూపొందించిన పాటకు అనూప్ సంగీతం అందించారు.ఆకట్టుకునే మ్యూజిక్ - పవర్ ఫుల్ లిరిక్స్‌తో ఈ సాంగ్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన బాధ్యతల స్వీకరణ చేస్తున్న సమయంలో చేసిన ప్రసంగంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో జరిగిన పోరాటం భాగస్వామ్యం పంచుకున్న వర్గాలు విద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలను హైలెట్ చేస్తూ ఈ వీడియో సాగింది. కాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం రూపొందిస్తున్న పాటకు సంగీతం సమకూర్చాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది.

రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చేసిన చర్యల్లో భాగంగా తెలుగు ప్రజలు పలు సందర్భాల్లో ఎదుర్కున్న కష్టనష్టాలు - మోసపోయిన వైనాన్ని ఎత్తి చూపింది. ఇదే సమయంలో జనసేన తీసుకువచ్చే మార్పులను వివరించనుంది. మొత్తంగా ఈ పాట జనసేన శ్రేణులను ఉర్రూతలిగిస్తుందనడంలో సందేహం లేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి