Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ ఇదే

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:35 AM GMT
ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ ఇదే
X
వ‌చ్చేస్తున్నా.. నేను వ‌చ్చేస్తున్నానంటూ గ‌డిచిన కొద్దిరోజులుగా మాట‌లు చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ షెడ్యూల్ దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా చెబుతున్నారు. వాస్త‌వానికి సెప్టెంబ‌రు నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో జోరుగా ప‌ని ప్రారంభించాల‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప‌వ‌న్ భావించారు. ఇదే విష‌యాన్ని గ‌తంలో వెల్ల‌డించారు కూడా. అయితే.. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తో చేస్తున్న సినిమా పూర్తి కాక‌పోవ‌టంతో.. ముందు దానిపై ఫోక‌స్ పెట్టారు.

ఈ సినిమాను ఒక కొలిక్కి తెచ్చిన త‌ర్వాత రాజ‌కీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల‌ని భావించిన‌ట్లుగా చెబుతారు. ఇటీవ‌ల విదేశీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొన్న ప‌వ‌న్‌.. లండ‌న్ వెళ్లి త‌న‌కు ప్ర‌క‌టించిన అవార్డును తీసుకున్నారు. ఆపై అక్క‌డ ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. నిన్న (సోమ‌వారం) తెల్ల‌వారుజామున హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. గ‌తానికి భిన్నంగా హైద‌రాబాద్ కు ప‌వ‌న్ చేరుకుంటున్న టైంను ప‌వ‌న్ మీడియా ప్ర‌తినిధులు మెసేజ్ ల రూపంలో మీడియాకు అందించారు.

ప‌వ‌న్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్న నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌ల్ని సిద్ధం చేసి.. ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర కాస్త హ‌డావుడి చేసేలా ఏర్పాట్లు చేయ‌టం గ‌మ‌నార్హం. ఇందుకు త‌గ్గ‌ట్లే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప‌వ‌న్ కు స్వాగ‌త ఏర్పాట్లు చేశారు. పార్టీకి సంబంధించిన ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్‌.. కీల‌క అంశాల మీద దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌టంతో పాటు.. స‌భ్య‌త్వ న‌మోదును ఉధృతం చేయాల‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌టానికి ఏమేం చేయాల‌న్న అంశాల‌పైనా దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మ‌రింత స‌మ‌యాన్ని కేటాయించ‌టంతో పాటు.. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌న్న ఆస‌క్తిని ప‌వ‌న్ ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో త‌న ప‌ర్య‌ట‌న‌ల్ని మొద‌లుపెట్టాల‌న్న నిర్ణ‌యానికి ప‌వ‌న్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. రానున్న ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో పార్టీ ఏమేం చేయాల‌న్న అంశంపై దృష్టి పెట్ట‌టం తో పాటు.. పార్టీ కార్య‌కలాపాల్ని మ‌రింత పెంచాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌టం.. పార్టీ ప్లీన‌రీని నిర్వ‌హించ‌టం లాంటివి చేయాల‌న్న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించి.. పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రికొద్ది రోజుల్లోనే త‌న పొలిటిక‌ల్ షెడ్యూల్ ను ప‌వ‌న్ విడుద‌ల చేసేలా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఏమైనా.. వ‌చ్చే నెల నుంచి ప‌వ‌న్ పొలిటిక‌ల్ కార్య‌క‌లాపాలు ముమ్మ‌రం కావ‌టం ఖాయ‌మ‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.