Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ అమ‌రావ‌తికి ప‌వ‌న్‌..రైతులతో భేటీ

By:  Tupaki Desk   |   21 Feb 2017 11:31 AM GMT
మ‌ళ్లీ అమ‌రావ‌తికి ప‌వ‌న్‌..రైతులతో భేటీ
X
జనసేన అధినేత - ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా త‌న రాజకీయ పార్టీని బలోపేతం చేయాల‌ని చూస్తున్నారా? అందరి చూపు ప‌డిన అమ‌రావ‌తి కేంద్రంగా పార్టీ భ‌విష్య‌త్ కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల‌నుకుంటున్నారా? ఈ క్ర‌మంలో కీల‌క‌మైన రాజధాని ప్రాంత నిర్వాసితుల‌పై దృష్టిసారించారా? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇపుడు ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది. తాజాగా చేనేత దీక్షలో పాల్గొనేందుకు మంగళగిరి వెళ్లిన జ‌న‌సేన అధినేతకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అదే రీతిలో మ‌రో కార్య‌క్ర‌మం పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెలాఖరుకు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని ఆ ప్రాంత రైతుల‌కు హామీ ఇచ్చారు.

చేనేత స‌త్య‌గ్ర‌హా దీక్ష‌కు హాజ‌రైన సంద‌ర్భంగా అక్కడ ప‌వ‌న్‌ను క‌లిసేందుకు లింగాయపాలెం - ఉద్దండ్రాయునిపాలెం గ్రామాలు సిద్ధ‌మ‌య్యారు. అయితే అనుమతి ఇవ్వకపోవడంతో ఒకరిద్దరు రైతులు మాత్రమే జ‌న‌సేన అధినేత‌ను కలిశారు. ఆ సమయంలో తమకు న్యాయం చేయించాలని రైతులు కోరగా నెలాఖరుకు వస్తాయని హామీనిచ్చారు. ఈ సంద‌ర్భంగా అవ‌స‌ర‌మైతే అమ‌రావ‌తి ప్రాంతంలోని రైతులంద‌రితో క‌లిసి పెద్ద బ‌హిరంగ నిర్వ‌హించుదామ‌ని ప‌వ‌న్ వ‌ద్ద స‌ద‌రు రైతులు ప్ర‌తిపాదించ‌గా ఆయ‌న త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పిన‌ట్లు సమాచారం. ఏ రూపంలో అయినా తాను బాధితుల‌కు చేరువ అవుతాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అలాగే గతంలో తనను కలిసిన తరువాత ప్రభుత్వం నుండి ఏమైనా ఒత్తిడులు వచ్చాయా అని స‌ద‌రు రైతుల‌ను ప‌వ‌న్ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. కాగా, సమస్యలపై చర్చించేందుకు రైతులను రమ్మని పిలిచినప్పటికీ సమయం లేదనే పేరుతో వారితో చర్చలను ఐదు నిముషాల్లోపే ముగించారని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/