Begin typing your search above and press return to search.

దీక్ష‌లో ప‌వ‌న్ సంచ‌ల‌నం..బాబుది వెన్నుపోటే

By:  Tupaki Desk   |   26 May 2018 4:48 PM GMT
దీక్ష‌లో ప‌వ‌న్ సంచ‌ల‌నం..బాబుది వెన్నుపోటే
X
ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జ‌నసేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన దీక్ష ముగిసింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సార‌థ్యంలోని ఏపీ ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగేలా శాంతియుతంగా పోరాటం చేస్తామని ప్రకటించిన‌ పవన్ కల్యాణ్ ఈ నిర‌స‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలోని ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో, ఉద్దానం బాధితుల కోసం పోరాటం చేస్తున్న మ‌రికొంత మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి దీక్ష‌కు కూర్చున్నారు. 24 గంట‌ల పాటు సాగిన ఈ దీక్ష ముగించిన సంద‌ర్భంగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబుది వెన్నుపోటు మ‌న‌స్త‌త్వ‌మ‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నట్లు పేర్కొన్న ప‌వ‌న్ ఏపీ సీఎం పేరును ప్ర‌స్తావించ‌కుండా వెన్నుపోటు వ్యాఖ్య‌లు చేశారు.

ఉద్దానం సమస్యపై తన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా పవన్ చేపట్టిన ఒకరోజు నిరాహారదీక్ష విరమించారు. ఉద్దానం బాధిత కుటుంబం పవన్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంత‌రం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టబడిన ప్రాంతం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 20వేల మంది ఉద్దానం కిడ్నీ బాధితులంటే ఎంతమందికి ప్రభుత్వం ఆర్థిక సాయం, పింఛన్లు అందిస్తోందని ప్రశ్నించారు. తాము నిర్దిష్ట‌మైన డిమాండ్లు చేస్తే త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి కళ్లు తెరిచి నిధులు-పెన్షన్-బస్సు సదుపాయం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి డయాలసిస్ సెంటర్లు పెంచాలి,బ్లడ్ బ్యాంక్ లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో విదేశాలకు వెళ్లడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం.. ఉద్దానం బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ఖర్చు పెట్టరని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రూ.2వేల కోట్లను పుష్కరాలకు కేటాయించిన ప్రభుత్వం.. ఆ మాత్రం ఉద్దానం బాధితుల కోసం ఖర్చు చేయలేదా? అని పవన్ ప్రశ్నించారు.

చంద్రబాబు అంటున్నట్లుగా తాను రాజకీయ గుర్తింపు కోసం దీక్ష చేయలేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. ``రాజకీయ గుర్తింపు కోసమైతే గత ఎన్నికల్లో మీకెందుకు మద్దతు ఇస్తాను?ముందుకు కౌగిలించుకుని వెనుకనుంచి వెన్నుపోటు పొడుతస్తున్నారని, ఇలాంటి వారిని నమ్మడం ఎలా? సినిమాలు వదులుకుని రావడం సరదా కాదు. సినిమాల్లో అయితే 2.30గంటల్లోనే సమస్యలు పరిష్కారమవుతాయని, కానీ, ఉద్దానం సమస్యలు పరిష్కరించగలిగినవారే నిజమైన హీరోలు. ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని అనుకోవద్దని.. అన్యాయం పరాకష్టకు చేరినప్పుడు ఉద్యమాలు వస్తాయి.``అంటూ ఏపీ సీఎం తీరుపై చంద్ర‌బాబు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.రోగుల బాధలు వినడానికి రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి కూడా లేరని పవన్ మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారి సమావేశం ఏర్పాటు చేసి ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.