Begin typing your search above and press return to search.

చిన‌బాబు వెన్నుపోటును చెప్పేసిన ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   20 April 2018 5:45 AM GMT
చిన‌బాబు వెన్నుపోటును చెప్పేసిన ప‌వ‌న్‌?
X
వెన్నుపోటు స్పెష‌లిస్ట్ గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. పిల్ల‌నిచ్చిన సొంత మామ‌ను వెన్నుపోటు పొడిచి.. ముఖ్య‌మంత్రి సీటు నుంచి కింద‌కు దించేసి.. తాను సీఎం సీట్లో కూర్చున్న మ‌ర‌క చంద్ర‌బాబును ఈ రోజుకీ వెంటాడుతూనే ఉంది. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ ఆయ‌న చేసిన త‌ప్పును అదే ప‌నిగా గుర్తు చేస్తుంటారు.

న‌మ్మిన వాళ్ల‌ను వెన్నుపోటు పొడ‌వ‌టంలో బాబుకు మించినోళ్లు లేర‌నే మాట త‌ర‌చూ చెబుతుంటారు. ఇంత‌కాలం చంద్ర‌బాబు వెన్నుపోటు గురించి మాత్ర‌మే వార్త‌ల్లోకి వ‌చ్చే వైనానికి భిన్నంగా తాజాగా బాబు కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ బాబు సైతం తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నారా? త‌మ‌ను న‌మ్మిన వారిని వెన్నుపోటు పొడ‌వ‌టంతో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలే వేరుగా ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌ను తాజాగా ప‌వ‌న్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఏపీలో టీడీపీ స‌ర్కారు ఏర్పాటులో ఎలాంటి సాయాన్ని కోర‌కుండానే మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని.. అలాంటి త‌న మీద‌.. బాబు.. ఆయ‌న కుమారుడు.. మీడియా శ‌క్తులు క‌లిసి చంపివేస్తుంటార‌ని ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ రోజు (శుక్ర‌వారం) చేస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో పాల్గొనాలంటూ ప‌వ‌న్ కు ఆహ్వానాన్ని పంపారు టీడీపీ సీనియ‌ర్ నేత క‌ళా వెంట్రావు. ఆయ‌న నుంచి వ‌చ్చిన ఆహ్వానంపై స్పందించిన వ‌ప‌న్‌.. ప‌నిలో ప‌నిగా చిన‌బాబు వెన్నుపోటు ఎలా ఉంటుందో చెప్పేశారు ప‌వ‌న్‌. ఏపీలో స‌ర్కారు ఏర్పాటు సంద‌ర్భంగా ఎలాంటివి ఆశించ‌కుండానే సాయం చేశామ‌ని.. అలాంటి త‌మ‌పై మీడియా శ‌క్తుల‌తో బాబు.. ఆయ‌న కుమారుడు.. ఆయ‌న స్నేహితులు చేస్తున్న కృషిపై లోకేశ్ త‌న వంతు సాయం తాను చేస్తాడ‌న్న మాట‌ను ప‌వ‌న్ తొలిసారి ఆరోపించార‌ని చెప్పాలి.

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ట్వీట్‌చూస్తే ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. బాబు.. చిన‌బాబు పుణ్య‌మా అని వెన్నుపోటు ఎఫెక్ట్ ఎంత‌లా ఉంటుందో తాజా ట్వీట్ లో చెప్పేశాడు ప‌వ‌న్‌. ఆయ‌నేమ‌న్నార‌న్న‌ది ఆయ‌న ట్వీట్ లోనే చూస్తే..

"ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ నారాచంద్ర‌బాబు నాయుడు గారికి న‌మ‌స్కారాలు.. మీ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. శ్రీ కిమిడి క‌ళా వెంట్రావు గారి ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన ఆహ్వానానికి ధ‌న్య‌వాదాలు. అందులో మీరు చేస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష లో రాష్ట్ర ములు గురించి పాల్గొనాల‌ని మీరు అడిగారు. అస‌లు రాష్ట్రానికి మేలు జ‌ర‌గాల‌ని ఏమీ ఆశించ‌కుండా మీ తెలుగుదేశం ప్ర‌భుత్వం రావ‌టానికి కృషి చేశాం"

"కానీ.. మీరు.. మీ అబ్బాయి.. అత‌ని స్నేహితులు చేయూత‌నిచ్చిన చేయిని వెన‌క‌మాలుగా మీ మీడియా శ‌క్తుల ద్వారా చంపివేస్తుంటారు. మిమ్మ‌ల్ని ఎలా న‌మ్మ‌టం?"