చంద్రబాబు నిర్మాణంలో పవన్ యాక్టింగ్

Sun Mar 24 2019 22:16:45 GMT+0530 (IST)

మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టేసరికి ఆవేశంత రెచ్చిపోతున్నాడు. తెలంగాణ పాకిస్థాన్ లా తయారైందని.. ఆంధ్రావాళ్లని అక్కడ కొడుతున్నారని ఏపీలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ సభలో హాజరైనా.. కేసీఆర్ ని చూపిస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నాడు. మీకు ఆత్మాభిమానం ఉంటే తెలంగాణ వాళ్లకు ఎలా అమ్ముడుపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ద్వారా తటస్తులుగా ఉండే ఓటర్లని తమవైపునకు తిప్పుకునే ప్రయ్తనం చేస్తున్నారు జనసేనాని. అయితే.. ఎవ్వరు అవునన్నా కాదన్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు మనిషిగా మారిపోయాడు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
            
చంద్రబాబు-పవన్ లోపాయకారి ఒప్పందం గురించి జగన్ మొదటినుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మరోసారి ఆరోపణలు చేశాడు. చంద్రబాబు నిర్మాణం దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడని ఆరోపించారు. మొన్నటి వరకు వాళ్లిద్దరూ తిట్టుకున్నారని.. ఇప్పడు ఒక్కటే తనని టార్గెట్ చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పవన్ ఒక్కటైపోయారని.. ప్రస్తుతం చంద్రబాబు రాసి ఇస్తున్న స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కల్యాణ్ యాక్ట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.  మొత్తానికి చంద్రబాబు పవన్ కల్యాణ్ మధ్య లోపాయకారి ఒప్పందాన్ని ప్రజలకు తెలిపేలా చేసేందుకు జగన్ బాగానే కష్టపడుతున్నారు.