Begin typing your search above and press return to search.

భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన చిలుక‌!

By:  Tupaki Desk   |   27 Oct 2016 9:56 AM GMT
భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన చిలుక‌!
X
కొంత‌మంది చిలుక‌ల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అవి ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటే మురిసిపోతూ ఉంటారు. మ‌నం ఏం మాట్లాడుకున్నా పెంపుడు చిలుక‌లు శ్ర‌ద్ధ‌గా వింటాయి. ప‌దేప‌దే వ‌ల్లెవేస్తూ తిరిగి చెబుతూ ఉంటాయి. అయితే, ఇలాంటి ఓ చిలుక ప‌లుకులే భ‌ర్త బండారాన్ని బ‌య‌ట‌పెట్టేసింది! అత‌గాడి రాస‌లీల గుట్టు విప్పేసింది. ప‌నిమ‌నిషితో పెట్టుకున్న అక్ర‌మ సంబంధాన్ని ఓ పెంపుడు చిలుక భార్య ముందు వాగేసింది. అంతే, ఆ ప‌లుకుల కార‌ణంగా అత‌గాడు జైలుకు వెళ్లే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌! ఇంత‌కీ... ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే... కువైట్‌లో!

హ‌వాల్లీ పోలీస్ స్టేష‌న్‌ లో భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది ఓ భార్య‌. త‌న ఇంట్లో ప‌నిమ‌నిషి ఉంద‌నీ, తాను ఉద్యోగానికి వెళ్లిపోయాక... ఆమెతో భ‌ర్త రాస‌లీలలు సాగిస్తున్నాడ‌ని ఆమె ఆరోపిస్తోంది. ఆమె ఆఫీస్ నుంచి త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంటే భ‌ర్త కంగారు ప‌డుతూ ఉండ‌టం... మ‌ధ్య‌లో ఫోన్ చేస్తే భ‌య‌ప‌డుతూ మాట్లాడుతూ ఉండ‌టంతో భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌పై ఆమెకి ముందే డౌట్ వ‌చ్చింద‌ట‌. అయితే, ఆ అనుమానం నూటికి నూరుపాళ్లు నిజం అనే విష‌యం చిలుక ప‌లుకుల ద్వారానే తెలిసింద‌ట‌! ప‌నిమ‌నిషితో త‌న భ‌ర్త పెట్టుకున్న ప్రేమ ముచ్చ‌ట్ల‌ను స‌ద‌రు చిలుక య‌థాత‌థంగా భార్య ముందు ముద్దుముద్దుగా వాగేసింది!

ప‌నిమ‌నిషితో భ‌ర్త ఎలా స‌ర‌సాలాడుతున్నాడో చిలుక మాట‌ల్లో త‌న‌కు తెలిసింద‌నీ, దాంతో భ‌ర్త త‌న‌ని మోసం చేస్తున్నాడంటూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టింది. అయితే, చిలుక ప‌లుకుల్ని సాక్ష్యంగా తీసుకుని కేసును విచారించ‌లేమ‌ని పోలీసులు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు అర‌బ్ టైమ్స్ ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది. టీవీలో వినిపించే సంభాష‌ణ‌ల్ని కూడా చిలుక రిపీట్ చేసే అవకాశం ఉంది కదా అనేది వారి లాజిక్‌. అయితే, భ‌ర్త సాగిస్తున్న రాస‌లీల‌లు ముమ్మాటికీ నిజ‌మ‌నీ, త‌న చిలుక అబ‌ద్ధం చెప్ప‌ద‌ని భార్య అంటోంది. ఒక‌వేళ ఇది నిరూప‌ణ అయితే స‌ద‌రు భ‌ర్త‌గారు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి.. ఓ చిలుక ఇంత పని చేసింద‌న్న‌మాట‌! అందుకే, మాట‌లు నేర్చిన చిలుక‌ల ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/