Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి పేప‌ర్ లెస్ పార్ల‌మెంట్‌!

By:  Tupaki Desk   |   26 Nov 2015 9:02 AM GMT
ఇవాల్టి నుంచి పేప‌ర్ లెస్ పార్ల‌మెంట్‌!
X
తాజా శీతాకాల స‌మావేశాల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. డిజిట‌ల్ యుగం న‌డుస్తున్నప్ప‌టికీ ఇప్ప‌టికీ పేప‌ర్ల వినియోగం భారీగానే సాగుతోంది. అయితే.. ఈ విధానానికి గురువారం నుంచి చెక్ ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అనుస‌రించిన విధానాల‌కు భిన్నంగా పార్ల‌మెంటు స‌మావేశాలు గురువారం నుంచి జ‌ర‌గ‌నున్నాయి. డిజిట‌ల్ ఇండియాలో కార్య‌క్ర‌మంలో భాగంగా.. పార్ల‌మెంటును పేప‌ర్ లెస్ పార్ల‌మెంటుగా మార్చ‌నున్నారు. ఇక‌పై.. పార్ల‌మెంటు స‌మావేశాల్లో పేప‌ర్ల‌ను వినియోగించ‌రు. స‌భ్యుల‌కు ఐ ప్యాడ్లు అందిస్తారు.

ఇక‌.. జీవోల జారీ మొద‌లు.. స‌భ‌కు సంబంధించిన బిల్లు ప‌త్రాలు అన్నీ డిజిట‌ల్ రూపంలోనే సాగ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన పేప‌ర్ పార్ల‌మెంటులో ఇక పేప‌ర్ లెస్ కానుంది. పార్ల‌మెంటులో ఐప్యాడ్ల‌ను ఎలా వినియోగించాల‌న్న విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. పేప‌ర్ లెస్ పార్ల‌మెంటు కార్య‌క్ర‌మాన్ని మోడీ స‌ర్కారు షురూ చేస్తుంటే.. గురువారం స‌భ‌లో మాట్లాడిన ప‌లువురు నేత‌లు పేప‌ర్లు ప‌ట్టుకొని ప్ర‌సంగాలు చేయ‌టం గ‌మ‌నార్హం.