Begin typing your search above and press return to search.

బాబును పొగ‌డ‌టానికి జ‌గ‌న్‌ ను ఇలా కూడా తిట్టాలా?

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:43 AM GMT
బాబును పొగ‌డ‌టానికి జ‌గ‌న్‌ ను ఇలా కూడా తిట్టాలా?
X
ఏపీ అధికార‌ప‌క్షం తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చి ప‌డింది. త‌న‌కున్న అనుకూల మీడియాతో తిమ్మిని బ‌మ్మిని చేయొచ్చ‌న్న ఆలోచ‌న చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్లాన్ అట్ట‌ర్ ప్లాప్ కావ‌ట‌మే కాదు.. రివ‌ర్స్ లో ఇప్పుడు కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌టంతో ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

టీడీపీ అధినేత‌కే ఇంత‌టి ఫ్రెష‌ర్ ఉంటే.. ఆ పార్టీ నేత‌ల ప‌రిస్థితి మ‌రెలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ కార‌ణంతోనే సంబంధం లేని అంశాల్ని ప్ర‌స్తావిస్తూ మీడియా ముందుకు వ‌చ్చి.. మ‌రింత ప‌లుచ‌న అవుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి ప‌రిటాల సునీత తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రెస్ మీట్ పెట్టారు. బాబు తీరును స‌మ‌ర్థించేందుకు ఉద్దేశించిన ఆమె ప్రెస్ మీట్ అందుకు భిన్నంగా సాగింది.

ఆమె సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. టీఆర్ ఎస్ పార్టీ గెలిస్తే ఏపీలో సంబరాలు ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. అలాంట‌ప్పుడు తెలంగాణలో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. ఏపీకి చెందిన ప‌లువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. తెలంగాణ‌కు వెళ్లి.. అక్క‌డ ప‌ని చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎదుటోడు వెలెత్తి ప్ర‌శ్నిస్తే త‌ట్టుకోలేని తెలుగు త‌మ్ముళ్లు.. త‌మ త‌ప్పుల్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా క‌వ‌ర్ చేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది.

ఇదే పెద్ద త‌ల‌నొప్పిగా మారే ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. గెలిచి సంబ‌రాలు చేసుకుంటే అర్థం ఉంటుంద‌ని.. కానీ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని జ‌గ‌న్ పార్టీని ఉద్దేశించి ప‌రిటాల సునీత చేస్తున్న విమ‌ర్శ‌ల్లో అర్థం లేనిది. మ‌నం ఆడ‌కున్నా.. కొన్నిసార్లు కొన్ని జ‌ట్ల‌ను స‌మ‌ర్థించ‌టం.. వారి విష‌యంలో సానుకూలంగా ఉండ‌టం చేసేదే. అలాంటి ప‌నే ఏపీలోని రాజ‌కీయ పార్టీలు చేశాయ‌ని చెప్పాలి.

ఆ తీరును త‌ప్పు ప‌ట్టి మ‌రోమారు త‌ప్పులో కాలేసే క‌న్నా.. ఆ విష‌యాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవట‌మే టీడీపీకి మేల‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. అందుకు భిన్నంగా కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని జ‌గ‌న్ పేరుతో క‌ల‌పాల‌న్న‌కుయుక్తితో లేనిపోని న‌ష్ట‌మే త‌ప్ప లాభం ఉండ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.