Begin typing your search above and press return to search.

ఎయిర్‌ లైన్స్ 160 మంది ప్యాసింజ‌ర్ల‌ను చంపాల‌నుకుంది

By:  Tupaki Desk   |   21 Sep 2018 6:10 PM GMT
ఎయిర్‌ లైన్స్ 160 మంది ప్యాసింజ‌ర్ల‌ను చంపాల‌నుకుంది
X
విమాన‌యాన సంస్థ ఏంటి...ప్ర‌యాణికుల‌ను చంపాల‌నుకోవడం ఏంటి పైగా 160 మంది అంటే...దాదాపుగా విమానంలో ఉన్న మొత్తం మంది అయి ఉంటారు క‌దా? అని ఆలోచిస్తున్నారు. అవును. మీ అంచ‌నా, అనుమానం రెండు క‌రెక్టే. వివ‌రాలు తెలుసుకుంటే మీకే విష‌యం అర్థ‌మైపోతుంది.

ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌ వేస్ విమానంలో పైలట్లు క్యాబిన్ ఎయిర్ ప్రెజర్ బటన్‌ ను ఆన్ చేయకపోవడం వల్ల 30 మంది ప్రయాణికులు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. వీళ్ల కొందరి ముక్కులు - చెవుల నుంచి రక్తం కూడా వచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఎపిసోడ్ మలుపులు తిరిగింది. ఎయిర్‌ లైన్స్‌ పై మ‌ర్డ‌ర్ కేసు ఫిర్యాదు అందింది.

ఫ్లైట్ సిబ్బంది నిర్వాకం వ‌ల్ల కొందరు ప్రయాణికులు తీవ్ర తలనొప్పి - పాక్షిక వినికిడి లోపాలతో బాధపడ్డారు. వీళ్లందరికీ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించారు. వాళ్లు కోలుకోవడానికి వారం - పది రోజులు పడుతుందని - అప్పటి వరకు మళ్లీ విమానం ఎక్కకూడదని డాక్టర్లు వాళ్లకు సలహా ఇచ్చారు. ఈ విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు. క్యాబిన్ ప్రెజర్ లేకపోవడంతో విమానాన్ని మళ్లీ ముంబైకి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్లను విధుల్లో నుంచి తొలగించారు. అయిన‌ప్ప‌టికీ...జెట్ ఎయిర్‌ వేస్ నిర్వాకాన్ని సీరియస్‌ గా తీసుకున్న ప్రయాణికులు.. జెట్ ఎయిర్‌ వేస్ సిబ్బందిపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. విమాన సిబ్బంది తన విధులను సరిగా నిర్వర్తించకపోవడం ప్రయాణికులపై హత్యాయత్నం చేయడమే అవుతుందని వాళ్లు ఆరోపిస్తున్నారు.